'కరోనా జయించిన వారిలో నాన్న కూడా ఉంటాడు'

Prince William Expresses Concern For His Father About Coronavirus - Sakshi

లండన్‌ : ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి గడగడలాడిస్తోన్న సంగతి తెలిసిందే. బ్రిటన్‌ రాజకుటుంబం కూడా మహమ్మారి బారీన పడిందన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రాజకుటుంబంలో క్వీన్‌ ఎలిజబెత్‌ పెద్ద కుమారుడు ప్రిన్స్‌ చార్లెస్‌ కరోనా బారీన పడి ప్రస్తుతం కోలుకుంటున్నారు. కాగా తండ్రి ఆరోగ్యంపై ప్రిన్స్‌ విలియమ్స్‌ స్పందించాడు.

' 70 ఏళ్ల వయసున్న నా తండ్రి ప్రిన్స్‌ చార్లెస్‌ గత నెలలో కోవిడ్‌-19 బారీన పడ్డాడు. ఒక వారం పాటు స్కాట్లాండ్‌లోని తన ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉంటూ చికిత్స పొందుతూ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. అయితే నా తండ్రికి చాతి ఇన్‌ఫెక్షన్‌తో పాటు పలు ఆరోగ్య సమస్యలు ఉండడంతో ఇప్పట్లో కోలుకోలేడోమోనని భావించాం. కానీ కరోనాను జయించిన వారిలో ఇప్పుడు మా నాన్న ముందు వరుసలో ఉంటాడు. అయితే నానమ్మ క్వీన్‌ ఎలిజబెత్‌, ఆమె భర్త ప్రిన్స్‌ ఫిలిప్‌ వయసులో పెద్దవారు కావడంతో వారి ఆరోగ్యంపై కొంచెం దిగులుగా ఉంది. అయినా వారి ఆరగ్యో పరిస్థితి ప్రస్తుతం బాగానే ఉంది. కరోనా మహమ్మారి వారి దరి చేరకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం' అంటూ చెప్పుకొచ్చారు. అంతేగాక కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్‌ విధించిడంతో ప్రజలంతా తమ మానసిక స్థైర్యాన్ని కోల్పోవద్దని, అది అంతా మన మంచికేనని ప్రిన్స్‌ విలియమ్స్‌, అతని భార్య కేట్‌ పేర్కొన్నారు. దేశంలో పరిస్థితులు చక్కబడేవరకు ప్రజలంతా మనో నిబ్భరం కోల్పోవ‍ద్దని, అందరూ దైర్యంగా ఉండాలని తెలిపారు.  
(హైడ్రాక్సీక్లోరోక్విన్ వ‌ల్ల క‌రోనా పూర్తిగా త‌గ్గ‌దు: ‌చైనా)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top