మాతో పెట్టుకుంటే మటాష్‌!

President Trump Warns Iran Not to Threaten U.S - Sakshi

ఇరాన్‌కు ట్రంప్‌ హెచ్చరిక

భయపడేది లేదన్న ఇరాన్‌

వాషింగ్టన్‌: తమతో సైనిక పరమైన ఘర్షణలకు దిగితే ఇరాన్‌ తుడిచిపెట్టుకుపోవడం ఖాయ మని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఘాటుగా హెచ్చరించారు. ఇరు దేశాల మధ్య సైనిక పరమైన ఉద్రిక్తత నెలకొన్న నేపథ్యంలో ట్రంప్‌ ఇలా వ్యాఖ్యానించారు. దీనిపై ట్రంప్‌ స్పందిస్తూ.. ‘ఇరాన్‌ మాతో యుద్ధం చేయాలనుకుంటే అధికారికంగానే ఆ దేశాన్ని తుడిచిపెట్టాల్సి వస్తుంది. మరోసారి అమెరికాను బెదిరించే సాహసం కూడా చేయలేదు..’ అని ట్రంప్‌ ఆదివారం ట్వీట్‌లో హెచ్చరించారు. ఇటు ఇరాన్‌ మిలిటరీ చర్యలపై ట్రంప్‌ అధికారులతో చర్చించారు. 

ఆదివారం ఓ న్యూస్‌ చానల్‌ ఇంటర్వ్యూలో ట్రంప్‌ మాట్లాడుతూ.. ‘నేను ఒకరిలా యుద్ధం చేయాలని కోరుకోవడం లేదు. ఎందుకంటే యుద్ధం వల్ల ఆర్థికంగా విపత్కర పరిస్థితులు ఎదుర్కోవడంతో పాటు ఎంతో మంది మరణించాల్సి వస్తుంది..’ అని చెప్పారు. ఇరాన్‌ విదేశాంగ మంత్రి మహ్మద్‌ జవద్‌ జరీఫ్‌ స్పందిస్తూ...ట్రంప్‌ యుద్ధ హెచ్చరికలకు జంకేది లేదన్నారు. ఇరాన్‌ను ఎవరూ ఏం చేయలేరని వ్యాఖ్యానించారు. ‘ఇరానియన్లు దురాక్రమణలను దాటుకొని వేలకొలది మైళ్లు విస్తరించారు. ఆర్థిక ఉగ్రవాదం, యుద్ధ బెదిరింపులతో ఇరాన్‌ను అంతం చేయలేరు.. ఇరానియన్లను గౌరవించే ప్రయత్నం చేయండి.. దాంతో ఏదైనా ఫలితముంటుంది..’ అని అన్నారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top