అధ్యక్షా.. మీరు అదుర్స్! | President Obama's official photographer shares the most captivating pictures from the White House in 2015 | Sakshi
Sakshi News home page

అధ్యక్షా.. మీరు అదుర్స్!

Jan 2 2016 5:52 PM | Updated on Sep 3 2017 2:58 PM

అధ్యక్షా.. మీరు అదుర్స్!

అధ్యక్షా.. మీరు అదుర్స్!

అమెరికా అధ్యక్షుడు బరాక్‌.. ఓ అగ్రరాజ్యానికి అధినేతగానే కాదు.. వ్యక్తిగతంగానూ మనసున్న నేతగా పేరు గడించారు.

అమెరికా అధ్యక్షుడు బరాక్‌.. ఓ అగ్రరాజ్యానికి అధినేతగానే కాదు.. వ్యక్తిగతంగానూ మనసున్న నేతగా పేరు గడించారు. ఈ కొత్త ఏడాదిలోనే అమెరికా అధ్యక్షుడిగా ఆయన పదవీకాలం ముగియబోతున్నది. ఈ సందర్భంగా 2015లో ఒబామా అధికార హోదాలో నిర్వహించిన కార్యకలాపాలనే కాదు.. వ్యక్తిగతంగా కుటుంబసభ్యులతో, వైట్‌హౌస్‌ సిబ్బందితో, ప్రజలతో మమేకమై.. ఓ సామాన్యుడిలా పంచుకున్న మధురస్మృతులను పీటీ సౌజా ఫొటోల్లో బంధించారు. అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌ అధికారిక ఫొటోగ్రాఫర్‌ అయిన సౌజా కొత్త సంవత్సరం సందర్భంగా ఒబామాకు చెందిన వందకుపైగా ఫొటోలను ప్రచురించారు. 

బ్లెడీ సండే 50వ దినోత్సవ వేడుకగా బహిరంగ సభలో భార్య మిషెల్ చేతిని ఆప్యాయంగా పట్టుకోవడం మొదలు.. హలోవీన్ పార్టీ సందర్భంగా వైట్‌హౌస్‌ సిబ్బంది పిల్లలకు విందు ఇవ్వడం వరకు ఒబామాలోని మానవతా కోణాన్ని పట్టిచ్చే ఎన్నో అందమైన ఫొటోలు ఇందులో ఉన్నాయి. కూతురు మాలియాతో ప్రేమగా గడుపడం, తనకన్నా చాలా పొడగరి అయిన ఎన్బీఏ ఆటగాడు షాక్విల్‌ ఓనియల్‌తో నవ్వుతూ ముచ్చట్లు పెట్టడం, పౌరుహక్కుల 50 దినోత్సవం సందర్భంగా కుటుంబ సమేతంగా పౌరులతో చేతులు కలిపి ర్యాలీలో పాల్గొనడం, భార్య మిషెల్‌తో ప్రేమగా గడుపడం వంటి వైవిధ్యభరితమైన ఒబామా ఫొటోలు చూడొచ్చు. అలాగే ఒబామా భార్య మిషెల్ బాక్సింగ్ చేయడం, కుటుంబంతో, బయట ఒబామా సన్నిహితంగా పంచుకున్న అనుభూతులకు చెందిన ఫొటోలను సౌజా ప్రచురించారు. .

Advertisement
 
Advertisement
Advertisement