మహిళకు క్షమాపణ చెప్పిన పోప్‌ | Pope Francis Apologises For Slapping Woman | Sakshi
Sakshi News home page

మహిళకు క్షమాపణ చెప్పిన పోప్‌ ప్రాన్సిస్‌

Jan 2 2020 10:33 AM | Updated on Jan 2 2020 4:55 PM

Pope Francis Apologises For Slapping Woman - Sakshi

వాటికన్‌ సిటీ : పోప్‌ ప్రాన్సిస్‌ ఓ మహిళకు క్షమాపణ చెప్పారు. ప్రతి ఒక్కరు సహనం కోల్పోతారని..అదే తనకు జరిగిందని తెలిపారు. వివరాల్లోకి వెళితే.. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా వాటికన్‌లో పలువురు భక్తులను పోప్‌ ప్రాన్సిన్‌ పలకరిస్తూ వెళ్లారు. ఈ సమయంలో అక్కడికి పెద్ద ఎత్తున చేరుకున్న భక్తుల్లో ఓ మహిళ ఆయన చేయి పట్టుకుని వెనక్కి లాగడంతో.. పోప్‌ పడిపోబోయారు. తర్వాత ఆయన వెంటనే నిలదొక్కుకొని.. సహనం కోల్పోయి మహిళ చేతిపై రెండు సార్లు కొట్టారు.

ఇందుకు సంబంధిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. కొందరు నెటిజన్లు పోప్‌కు వ్యతిరేకంగా కామెంట్‌లు పెట్టగా.. మెజారిటీ నెటిజన్లు ఆ మహిళ చర్యను తప్పుబట్టారు. అయితే ఈ చర్యపై పోప్‌ ట్విటర్‌లో స్పందించారు. ‘మనం చాలా సార్లు సహనం కోల్పోతుంటాం. అదే నా విషయంలో జరిగింది. నిన్న నేను చేసిన పనికి క్షమాపణలు చెబుతున్నాను’ అంటూ పేర్కొన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement