కొలంబియాలో కూలిన విమానం | Plane crashes in Colombia | Sakshi
Sakshi News home page

కొలంబియాలో కూలిన విమానం

Nov 30 2016 2:17 AM | Updated on Oct 2 2018 8:39 PM

కొలంబియాలో కూలిన విమానం - Sakshi

కొలంబియాలో కూలిన విమానం

కొలంబియాలో విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో బ్రెజిల్‌కు చెందిన ఫుట్‌బాల్ క్రీడాకారులతో సహా 75 మంది దుర్మరణం పాలయ్యారు.

75 మంది మృతి

 లా యూనియన్: కొలంబియాలో విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో బ్రెజిల్‌కు చెందిన ఫుట్‌బాల్ క్రీడాకారులతో సహా 75 మంది దుర్మరణం పాలయ్యారు. విమానంలో ప్రయాణిస్తున్న 81 మందిలో నలుగురు ఫుట్‌బాల్ క్రీడాకారులతో పాటు మరో ఇద్దరు ప్రయాణికులు బతికి బయటపడ్డారు.  స్థానిక కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 10 గంటలకు మెడిలిన్‌‌స అంతర్జాతీయ ఎరుుర్‌పోర్టుకు సమీపంలోని కొండల్లో ఈ ప్రమాదం జరిగింది. విమానం దక్షిణ అమెరికాలోని బొలీవియాలోని జాస్ మరియా కార్డోవా  విమానాశ్రయం నుంచి కొలంబియాలోని మెడిలిన్‌‌స విమానాశ్రయానికి వెళ్లాల్సి ఉంది.

బ్రెజిల్ ఫుట్‌బాల్ క్రీడాకారులతో సహా 72 మంది ప్రయాణికులు, 9 మంది సిబ్బంది ప్రయాణిస్తున్నారు. విమానంలో  విద్యుత్ సదుపాయం వైఫల్యం వల్ల ప్రమాదం సంభవించినట్లు అధికారులు  భావిస్తున్నారు. పర్వతాల్లోకి వెళ్లాక విమానానికి రాడార్‌తో సంబంధాలు తెగిపోయాయని మెడిలిన్‌‌స విమానాశ్రయ అధికారులు తెలిపారు. కోపా సుడమెరికానా టోర్నీ ఫైనల్స్‌లో భాగంగా అట్లెటికో నసియోనల్‌తో బుధవారం జరిగే మ్యాచ్ కోసం బ్రెజిల్ చాపికోరుున్‌‌స ఫుట్‌బాల్ జట్టు విమానంలో బయలుదేరింది.  ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా  బయల్దేరిన జట్టు సభ్యులు ఈ ప్రమాదంలో మృతిచెందడం అందరినీ కలచివేసింది. బ్రెజిల్ అధ్యక్షుడు మైకేల్ టెమెర్ మూడు రోజులు సంతాప దినాలుగా పాటించనున్నట్లు ప్రకటించారు. మరోవైపు కోపా సుడమెరికన్ ఫైనల్ మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు దక్షిణ అమెరికా ఫుట్‌బాల్ కాన్ఫెడరేషన్ ప్రకటించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement