తాలిబన్ చీఫ్ ఫజులుల్లా హతం ! | Pakistan Taliban Head Maulana Fazlullah Killed? | Sakshi
Sakshi News home page

తాలిబన్ చీఫ్ ఫజులుల్లా హతం !

Dec 20 2014 11:19 AM | Updated on Mar 23 2019 8:32 PM

తాలిబన్ చీఫ్ ఫజులుల్లా హతం ! - Sakshi

తాలిబన్ చీఫ్ ఫజులుల్లా హతం !

పాక్ సైన్యం జరిపిన ద్రోణి దాడుల్లో పాక్ తాలిబన్ చీఫ్ మౌలానా ఫజులుల్లా హతమైనట్లు పాక్ మీడియాలో శనివారం విస్తృతంగా కథనాలు వచ్చాయి.

పాకిస్థాన్ :  పాక్ సైన్యం జరిపిన ద్రోణి దాడుల్లో పాక్ తాలిబన్ చీఫ్ మౌలానా ఫజులుల్లా హతమైనట్లు పాక్ మీడియాలో శనివారం విస్తృతంగా కథనాలు వచ్చాయి.  పెషావర్లో ఇటీవల జరిగిన ఆర్మీ స్కూల్పై తీవ్రవాదుల దాడిలో 148 మంది హతమైన ఘటనకు ఫజులుల్లానే సూత్రధారిని పాక్ ప్రభుత్వం భావిస్తుంది. ఈ పెషావర్ ఘటన అంతర్జాతీయంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో పాక్ - ఆఫ్ఘానిస్థాన్ సరిహద్దుల్లోని స్వాత్ లోయని తాలిబన్ స్థావరాలపై పాక్ సైన్యం ద్రోణి దాడులు చేసింది.

ఈ దాడుల్లో ఫజులుల్లా మృతి చెందినట్లు తెలిపింది. ఇన్నాళ్లు ఫజ్‌లుల్లా గురించి తెలిసినా.. పట్టించుకోనట్టు ఉన్నా పాక్‌ పెద్దలు.. పెషావర్ దాడితో సైనిక దాడులు చేయాలని ప్రభుత్వం ఆదేశించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఫజ్‌లుల్లా స్థావరం గురించి పక్కాగా తెలుసుకున్న సైన్యం,..ద్రోణి దాడులతో మట్టుపెట్టినట్టు పాక్‌ మీడియా వర్గాలు వెల్లడించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement