పుల్వామా ఉగ్రదాడిపై స్పందించిన పాక్‌

Pakistan PM Imran Khan Respons on Pulwama Terrorist Attack - Sakshi

పాక్‌పై నిరాధారణ ఆరోపణలు చేస్తున్నారు

సాక్ష్యాలు ఉంటే చూపించండి చర్యలు తీసుకుంటాం

దాడులు చేస్తే దీటుగా ఎదుర్కొంటాం

పుల్వామా ఉగ్రదాడిపై  పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌

లాహోర్‌ : పుల్వామా ఉగ్రదాడిపై పాకిస్తాన్‌ స్పందించింది. ఎలాంటి ఆధారాలు లేకుండా భారత్‌ తమను నిందిస్తుందని ఆ దేశ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ తెలిపారు. ఈ ఉగ్రదాడితో తమకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఘటన జరిగిన 5 రోజుల తర్వాత ఇమ్రాన్‌ ఖాన్‌ స్పందించారు. భారత్‌ వద్ద సాక్ష్యాలు ఉంటే చూపించాలని, చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. తామూ ఉగ్రవాదుల బాధితులమేనని, ఉగ్రకార్యకలాపాలతో ఇబ్బందుల ఎదుర్కొంటున్నామన్నారు. ఈ ఉగ్రదాడి దర్యాప్తులో భారత్‌కు పూర్తిగా సహకరిస్తామన్నారు. ఉగ్రవాదంపై చర్చలకు పాక్‌ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందన్నారు.

కశ్మీర్‌ సమస్య సైనిక చర్యతో పరిష్కారం కాదని, చర్చలతోనే ఈ వివాదాన్ని పరిష్కరించవచ్చని అభిప్రాయపడ్డారు. భారత్‌ తమపై దాడి చేయాలని భావిస్తే...దీటుగా ఎదుర్కొంటామన్నారు. భారత్‌లో ఎన్నికల ఏడాది కనుకనే ఈ ఉగ్రదాడి విషయంలో పాక్‌ను నిందిస్తున్నారని పేర్కొన్నారు.  

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top