హఫీజ్‌కు పాక్‌ ప్రధాని మద్దతు | Pakistan PM backs Hafiz Saeed | Sakshi
Sakshi News home page

హఫీజ్‌కు పాక్‌ ప్రధాని మద్దతు

Jan 17 2018 10:40 AM | Updated on Jan 17 2018 10:47 AM

Pakistan PM backs Hafiz Saeed - Sakshi

ఇస్లామాబాద్‌ : ముంబై దాడుల సూత్రధారి, ఉగ్ర సంస్థ జమాతే ఉద్‌ దవా చీఫ్‌ హఫీజ్‌ సయీద్‌కు పాకిస్తాన్‌ ప్రధాని షాహిద్‌ ఖాన్‌ అబ్బాసీ మద్దతు ప్రకటించారు. అంతర్జాతీయ ఉగ్రవాదిగా అమెరికా ప్రకటించిన హఫీజ్‌ సయీద్‌పై పాకిస్తాన్‌లో ఎటువంటి కేసులు లేవని.. ఆయన స్పష్టం చేశారు. ఒక పాకిస్తాన్‌ టీవీ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన సందర్భంలో పాక్‌ ప్రధాని ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా హఫీజ్‌ సయీద్‌ను పొరుగుదేశ ప్రధాని సహాబ్‌ అని సంబోధించడం గమనార్హం.

ఇదిలావుండగా అమెరికా నిధులు నిలిపివేయడంతో... హఫీజ్‌ సయీద్‌ను పొరుగుదేశం నిషేధిత ఉగ్రవాదుల జాబితాలో చేర్చిన విషయం తెలిసిందే. తాజా పరిణామాల నేపథ్యంలో హఫీజ్‌ గురించి.. పాక్‌ ప్రధాని అనూహ్య వ్యాఖ్యలు చేశారు. అబ్బాసీ వ్యాఖ్యలు మరింత అంతర్జాతీయంగా మరింత మంటలు రాజేస్తాయని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement