మళ్లీ తడబడ్డ పాకిస్తాన్‌ | Pakistan fails again | Sakshi
Sakshi News home page

మళ్లీ తడబడ్డ పాకిస్తాన్‌

Oct 17 2017 5:33 PM | Updated on Mar 28 2019 6:10 PM

Pakistan fails again - Sakshi

ఇస్లాబాబాద్‌ : తప్పుడు ఆధారాలతో ప్రపంచాన్ని మోసం చేయాలనుకున్న పాకిస్తాన్‌.. మరోసారి బోల్తాపడింది. మా దేశంలో అద్భుత పర్యాటక స్థలాలున్నాయి.. టూరిస్టులు రండి.. అంటూ ఒక వీడియోను పాకిస్తాన్‌ టూరిజం శాఖ తన ట్విటర్‌లో అకౌంట్‌లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం అన్నిదేశాలు ఇలాగే తమ తమ దేశంలోని టూరిజాన్ని ప్రమోట్‌ చేసుకుంటున్నాయి. ఇందులో పాకిస్తాన్‌ను తప్పుపట్టాల్సింది ఏమీ లేకపోయినా.. పొరుగు దేశంలోని చారిత్రక కట్టడం తమ దేశంలో ఉన్నట్టు చూపించి చిక్కుల్లో ఇరుక్కుంది.

ఆఫ్ఘనిస్తాన్‌లోని చారిత్రక వాసరత్వ కట్టడం హజ్రత్‌ ఆలీ మసీదును పాకిస్తాన్‌ తమ దేశంలో ఉన్నట్లు వీడియో లో పేర్కొంది. మజర్‌ ఈ షరీఫ్‌ మసీదును స్థానికులు అక్కడ బ్లూ మసీదు అని పిలుచుకుంటారు. ఈ మసీదును పాకిస్తాన్ అధికారులు తమ దేశంలో ఉన్నట్లు వీడియోలో చూపించారు. దీనిపై నెటిజన్లు సోషల్‌ మీడియాలో మండిపడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement