
ఇస్లామాబాద్ : ఘోర తప్పిందంతో ఓ ఉర్దూ న్యూస్ ఛానెల్ పరువు పొగొట్టుకుంది. పాప్ సింగర్ ఎడ్ షీరన్‌ను మహిళగా అభివర్ణిస్తూ ఓ కథనం ప్రసారం చేసింది. దీంతో సదరు ఛానెల్‌ను సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఫిమేల్ రీడర్‌తో గొడవ.. వైరల్
షేప్ ఆఫ్ యూ, కాసెల్ రాక్ ఆల్బమ్‌లతో ప్రపంచవ్యాప్తంగా యూత్‌ను ఉర్రూతలూగించాడు షీర్. నాలుగు సార్లు గ్రామీ అవార్డులు గెలుచుకున్న అతగాడి గురించి కనీస అవగాహన లేనట్లుగా ఇస్లామాబాద్‌కు చెందిన ఎక్స్‌ప్రెస్ న్యూస్ ఛానెల్ కథనం ప్రసారం చేసింది. అయితే ఈ క్రమంలో అతను ఫోటోలు, విజువల్స్‌ను ప్రదర్శిస్తూ మరీ పాప్ క్వీన్‌గా కింద స్క్రోలింగ్ వేయటం, బులిటెన్‌లో యాంకర్ న్యూస్ చదివి వినిపించారు. ఈ వార్తను ఓ వ్యక్తి వీడియోతోపాటు ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు.
‘బ్రిటిష్ పాప్ క్వీన్ ఎడ్ షీరన్ 2017 బెస్ట్ ఫిమేల్ సింగర్‌గా ఎంపికయ్యారు’... మొత్తానికి పాక్ న్యూస్ చానళ్లు లింగ సమానత్వం (జెండర్ ఈక్వాలిటీ) పాటిస్తున్నాయి. ఎక్స్‌ప్రెస్ న్యూస్ వాళ్లకు ఆడా-మగా తేడా లేకుండా పోయింది. దయ చేసి ఈ విషయాన్ని షీరన్‌కు ఎవరూ చెప్పకండి, కనీస అవగాహన లేనివాళ్లు న్యూస్ ఛానెళ్లు ఎందుకు నడుపుతున్నారో అర్థం కావట్లేదు... ఇలాంటి రీ ట్వీట్లు ఇప్పుడు కనిపిస్తున్నాయి.
Ed Sheeran pop queen aur gulukara?😂
— Imad Kazmi (@imadtweetss) 27 February 2018
Express news thinks that Ed Sheeran is a female😂😂 pic.twitter.com/EloM0uHoXN