భారత జర్నలిస్టులను దేశం విడిచి వెళ్లమన్న పాకిస్తాన్ | Sakshi
Sakshi News home page

భారత జర్నలిస్టులను దేశం విడిచి వెళ్లమన్న పాకిస్తాన్

Published Sat, May 10 2014 6:11 PM

భారత జర్నలిస్టులను దేశం విడిచి వెళ్లమన్న పాకిస్తాన్ - Sakshi

పాకిస్తాన్ మన దేశానికి చెందిన ఇద్దరు జర్నలిస్టులను తమ దేశం విడిచి వెళ్లమని ఆదేశించింది. వీరిద్దరినీ ఒక వారం లోపు పాకిస్తాన్ వదలి వెళ్లమని ఆజ్ఞ జారీ చేసింది. 
 
'ది హిందూ' కరస్పాండెంట్ మీనా మెనన్, పీటీఐ కరస్పాండెంట్ స్నేహేశ్ ఫిలిప్ ల వీసాలను పొడగించడానికి పాకిస్తాన్ నిరాకరించింది. వీరిద్దరూ గత ఏడాది ఆగస్టు నుంచి ఇస్లామాబాద్ లో పనిచేస్తున్నారు. వీరి వీసాల గడువు ఈ ఏడాది మార్చి 9 న ముగిసింది. దీనితో వీరిద్దరు రెన్యూవల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. 
 
అయితే వీసాల నిరాకరణకు, వారిని దేశం విడిచి వెళ్లమనడానికి గల కారణాలు మాత్రం పాకిస్తాన్ వెల్లడించలేదు. 
 

Advertisement
Advertisement