breaking news
indian journalists
-
మీరు దేశాన్ని గర్వపడేలా చేశారు..
సాక్షి, న్యూఢిల్లీ : ఫీచర్ ఫోటోగ్రఫీలో పులిట్జర్ అవార్డును పొందిన ముగ్గురు భారత ఫోటో జర్నలిస్టులను కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ అభినందించారు. ‘మీ ముగ్గురు దేశాన్ని గర్వపడేలా చేశారు’ అంటూ మంగళవారం ట్వీట్ చేశారు. ఇక భారత్‌కు చెందిన ముగ్గురు ఫోటోగ్రాఫర్స్ యాసిన్, చన్నీ ఆనంద్, ముక్తార్ ఖాన్ ఫీచర్ ఫోటోగ్రఫీ అవార్డుల అందుకున్న విషయం తెలిసిందే. వీరు ముగ్గురు అసోసియేటెడ్ ప్రెస్‌తో కలిసి పనిచేశారు. గతేడాది కశ్మీర్లో ఆర్టికల్ 370ను తొలగించిన సమయంలో జరిగిన నిరసనలను, భద్రతా దళాలు, హింసాకాండలకు చెందిన పలు చిత్రాలను వీరు తమ కెమెరాల్లో బంధించి ప్రపంచానికి చూపారు. ఈ నేపథ్యంలో స్థానిక పరిస్థితులను కళ్లకు కట్టినట్లు చూపించినందుకు వీరికి పులిట్జర్ ఫీచర్ ఫోటోగ్రఫీ అవార్డులు వరించాయి. (ఢిల్లీలో జర్నలిస్టులకు తెలంగాణ ప్రభుత్వం సాయం ) Congratulations to Indian photojournalists Dar Yasin, Mukhtar Khan and Channi Anand for winning a Pulitzer Prize for their powerful images of life in Jammu & Kashmir. You make us all proud. #Pulitzer https://t.co/A6Z4sOSyN4 — Rahul Gandhi (@RahulGandhi) May 5, 2020 దార్ యాసిన్, ముక్తార్ ఖాన్ కశ్మీర్‌కు చెందిన వ్యక్తులు కాగా ఆనంద్ మాత్రం జమ్మూలో నివసిస్తున్నాడు. న్యూయార్క్ టైమ్స్, ఎంకరేజ్ డైలీ న్యూస్, ప్రో పబ్లికాలకు పులిట్జర్ బహుమతి లభించింది. కాగా జర్నలిజం రంగంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైదనది పులిట్జర్ అవార్డు. దీనిని వార్తాపత్రికలు, సాహిత్యం, ఆన్లైన్ పత్రికారచన, సంగీతం వటి రంగాలలో విశేష కృషి చేసిన వారికి ప్రధానం చేస్తారు. (అడ్వకేట్లకు అండగా నిలిచిన ప్రభుత్వం) -
వాట్సాప్ హ్యాకింగ్.. వెలుగులోకి సంచలన అంశాలు!
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా 20 దేశాలకు చెందిన 1400 మంది వాట్సాప్ ఖాతాలను హ్యాక్ చేసి గూఢచర్యం నెరిపిన వ్యవహారం తీవ్ర సంచలనం రేపుతోంది. ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్ఎస్వో గ్రూప్ స్పైవేర్ పెగాసస్ ద్వారా ఆయా వ్యక్తుల వాట్సాప్ ఖాతాల్లో ఎలాంటి సమాచారం మార్పిడి అవుతుందో నిఘా పెట్టారని ఫేస్బుక్ యాజమాన్యంలోని వాట్సాప్ సంస్థ తాజాగా సంచలన విషయాలు బయటపెట్టింది. పెగాసస్ సాఫ్ట్వేర్ ద్వారా 20 దేశాలకు చెందిన 1400 మంది వాట్సాప్ ఖాతాలను హ్యాక్ చేశారని, ఇందుకుగాను ఇజ్రాయెల్ కంపెనీ ప్రభుత్వ గూఢచారులకు వెన్నుదన్నుగా నిలిచిందని ఆరోపిస్తూ కాలిఫోర్నియాకు చెందిన ఓ కంపెనీ కోర్టులో పిటిషన్ వేసింది. ఈ పిటిషన్‌కు సమాధానమిస్తూ వాట్సాప్ ఈ విస్మయ పరిచే విషయాలను వెల్లడించింది. ఇలా వాట్సాప్ ఖాతాలు హ్యాకింగ్ గురైన వ్యక్తులు భారతీయులు కూడా ఉన్నారు. అయితే, సరిగ్గా ఎంతమంది వాట్సాప్ ఖాతాలపై ప్రభుత్వం నిఘా పెట్టిందనే విషయాలను వాట్సాప్ వెల్లడించలేదు. జర్నలిస్టులు, విద్యావేత్తలు, దళిత, మానవ హక్కుల కార్యకర్తలు ఇలా కనీసం 24మందికిపైగా వాట్సాప్ ఖాతాలు హ్యాకింగ్‌కు గురయ్యాయని తెలుస్తోంది. ఈ ఏడాది మే నెలలో రెండువారాలపాటు వారి వాట్సాప్ ఖాతాలు హ్యాకింగ్‌కు గురయ్యాయని, ఈ విషయాన్ని స్పెషల్ మెసెజ్ ద్వారా హాకింగ్ బారిన పడిన వ్యక్తులకు తెలియజేశామని ఫేస్బుక్ ఒక ప్రకటనలో వెల్లడించింది. ‘2019 మే నెలలో అత్యంత పటిష్టమైన సైబర్ అటాక్‌ను మేం అడ్డుకున్నాం. మా వీడియో కాలింగ్ సిస్టంలోకి చొరబడి.. పలువురు వాట్సాప్ యూజర్ల మొబైల్ డివైజ్‌ల్లోకి మాల్వేర్ను పంపేందుకు ఈ అటాక్ ప్రయత్నించింది. ఈ దాడి జరిగిన యూజర్ వీడియో కాల్‌ను ఎత్తకపోయినా.. ఇది మొబైల్‌లోకి చొరబడుతుంది. మేం వెంటనే కొత్త ప్రొటెక్షన్స్ యాడ్ చేసి వాట్సాప్ నూతన అప్డేట్ను అందుబాటులోకి తెచ్చాం. ప్రజల ఖాతాలు సురక్షితంగా ఉండేలా చర్యలు తీసుకున్నాం. నేరుగా ఈ సైబర్ అటాక్ బారిన పడినట్టు భావిస్తున్న దాదాపు 1400మంది యూజర్లకు ప్రత్యేక వాట్సాప్ మెసెజ్ ద్వారా సమాచారమిచ్చాం’ అని ఫేస్బుక్ తెలిపింది. దేశంలోని పలువురు జర్నలిస్టులు, హక్కుల కార్యకర్తలు, విద్యావేత్తల వాట్సాప్ ఖాతాలపై ప్రభుత్వం గూఢచర్యం నెరిపినట్టు వస్తున్న కథనాలపై కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజల ప్రైవసీ హక్కుల పట్ల బీజేపీ సర్కారుకు ఏమాత్రం చిత్తశుద్ధి లేదని, ఈ గూఢచర్యం వ్యవహారంపై సుప్రీంకోర్టు సుమోటోగా విచారణ జరపాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. -
'గేటు వద్ద కూడా ఉండొద్దు..'
న్యూఢిల్లీ: ఇస్లామాబాద్ లో జరిగిన సార్క్ హోంమంత్రుల సదస్సుకు భారత జర్నలిస్టులను అనుమతించని పాకిస్తాన్ వారిని కనీసం ప్రవేశ ద్వారం వద్ద కూడా ఉండనివ్వలేదని వెల్లడైంది. సార్క్ దేశాల ప్రముఖులను పాక్ హోంమంత్రి నిసార్ ప్రవేశ ద్వారం వద్ద ఆహ్వానిస్తున్నపుడు భారత జర్నలిస్టులు అక్కడే ఉన్నారు. భారత హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ రాగానే పాక్ జర్నలిస్టులు ఫోటోలు తీసేందుకు సన్నద్ధమవుతుండగా వీరూ వెళ్లారు. అయితే అక్కడ నుండి వెళ్లిపోవాలని, గేటు బయట నిలబడేందుకూ కూడా భారత్ జర్నలిస్టులకు అనుమతి లేదని పాక్ అధికారులు తేల్చి చెప్పారు. -
'ఆ జర్నలిస్ట్‌లను స్వదేశం పంపవద్దు'
దేశంలోని ఇద్దరు భారతీయ జర్నలిస్టులు తిరిగి స్వదేశానికి వెళ్లిపోవాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ద పాకిస్థాన్ - ఇండియా పీపుల్స్ ఫోరమ్ ఫర్ పీస్ అండ్ డెమెక్రసీ (పీఐపీఎఫ్పీడీ) మంగళవారం పాకిస్థాన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. మంగళవారం ముంబైలో పీఐపీఎఫ్పీడీ కార్యాలయ ప్రతినిధులు ఆశా హన్స్, జతిన్ దేశాయిలు మాట్లాడుతూ...పాకిస్థాన్‌లో విధులు నిర్వర్తిస్తున్న ఇద్దరు జర్నలిస్టులు మీనా మీనన్ (ద హిందూ), ఎస్.ఫిలప్ (పీటీఐ)ల వీసా గడువును పోడిగించాలని ఆ దేశ ప్రభుత్వాన్ని కోరారు. ప్రస్తుతం భారత్‌లో సార్వత్రిక ఎన్నికలు జరగుతున్నాయి... ఇలాంటి సమయంలో జర్నలిస్టులను స్వదేశాలకు వెళ్లిపోవాలని ఆదేశించడం పొరుగుదేశమైన పాక్‌కు అంత శ్రేయస్కరం కాదని వారు ఆభిప్రాయపడ్డారు. వీసా విధానంలో మరిన్ని అంశాలపై భారత్, పాక్ దేశాలు ఓ అవగాహనకు రావల్సిన అవశ్యకత ఉందని వారు ఈ సందర్బంగా అభిప్రాయపడ్డారు. మీనా మీనన్, ఫిలిప్‌లకు న్యాయం జరగుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. పాకిస్థాన్‌లో విధులు నిర్వర్తిస్తున్న మీనా మీనన్, ఎస్.ఫిలిప్ భారతీయులు వీసా గడువు ఈ ఏడాది మార్చితో ముగిసింది. అయితే ఆ గడువును వారు పునరుద్దరించుకోలేదు. దాంతో సదరు భారతీయ జర్నలిస్టులు ఇద్దరు వారం రోజుల్లోగా స్వదేశం వెళ్లిపోవాలని పాక్ ప్రభుత్వ ఆదేశించిన సంగతి తెలిసిందే. పాక్ ప్రభుత్వ నిర్ణయాన్ని ఇప్పటికే ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా, ప్రెస్ క్లబ్ ఆఫ్ ముంబైలు ఖండించాయి. -
భారత జర్నలిస్టులను దేశం విడిచి వెళ్లమన్న పాకిస్తాన్
పాకిస్తాన్ మన దేశానికి చెందిన ఇద్దరు జర్నలిస్టులను తమ దేశం విడిచి వెళ్లమని ఆదేశించింది. వీరిద్దరినీ ఒక వారం లోపు పాకిస్తాన్ వదలి వెళ్లమని ఆజ్ఞ జారీ చేసింది. 'ది హిందూ' కరస్పాండెంట్ మీనా మెనన్, పీటీఐ కరస్పాండెంట్ స్నేహేశ్ ఫిలిప్ ల వీసాలను పొడగించడానికి పాకిస్తాన్ నిరాకరించింది. వీరిద్దరూ గత ఏడాది ఆగస్టు నుంచి ఇస్లామాబాద్ లో పనిచేస్తున్నారు. వీరి వీసాల గడువు ఈ ఏడాది మార్చి 9 న ముగిసింది. దీనితో వీరిద్దరు రెన్యూవల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే వీసాల నిరాకరణకు, వారిని దేశం విడిచి వెళ్లమనడానికి గల కారణాలు మాత్రం పాకిస్తాన్ వెల్లడించలేదు.