ఇది మా వాహనం... | Older couples using dogs pulling cart for transportation requirements | Sakshi
Sakshi News home page

ఇది మా వాహనం...

Mar 6 2016 2:52 AM | Updated on Sep 29 2018 4:26 PM

ఇది మా వాహనం... - Sakshi

ఇది మా వాహనం...

చైనాలోని ఝెజియాంగ్ ఫ్రావిన్స్‌లోని యివూ పట్టణంలో ఓ వృద్ధ దంపతులు ఇలా కుక్కలు లాగే బండిని తమ రవాణా అవసరాలకు ఉపయోగిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు.

చైనాలోని ఝెజియాంగ్ ఫ్రావిన్స్‌లోని యివూ పట్టణంలో ఓ వృద్ధ దంపతులు ఇలా కుక్కలు లాగే బండిని తమ రవాణా అవసరాలకు ఉపయోగిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. రిటైరయ్యాక మోకాళ్ల నొప్పి కారణంగా ఎక్కువ దూరం నడవలేకపోతున్నపుడు ఈ ఐడియా వచ్చిందని చెబుతున్నాడీ పెద్దమనిషి. ఆయన దగ్గర ఓ ఎలక్ట్రికల్ స్కూటరుండేది. అతి బాగా పాతదైపోయి పనికిరాకుండా పోయింది. దాని ఇంజిన్‌ను తొలగించి... ఇలా తన పెంపుడు కుక్కలను కట్టేసి లాగించేస్తున్నాడు. అదేమిటి కొత్తది కొనుక్కోవచ్చు కదా... అంటే తనకు ఇప్పుడంత ఆర్థిక స్తోమత లేదని బదులిస్తున్నాడు. ఈ బండిలో దంపతులిద్దరూ షికారుకెళితే రోడ్డుపై అందరి చూపు వీరిపైనే. కొందరు జంతు ప్రేమికులేమో శునకాలను హింసించడం అన్యాయమంటూ మొత్తుకుంటున్నారు. ఇంకొందరేమో ఇది చట్టబద్ధమేనా అని నెట్‌లో నిలదీస్తున్నారు. మొత్తానికి ఇప్పటికైతే పోలీసులు వీరి విషయంలో కలుగజేసుకోలేదు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement