మళ్లీ అణ్వస్త్రాల తయారీని ప్రారంభిస్తాం

North Korea threatens to restart nuclear weapons programme - Sakshi

అమెరికాకు ఉత్తరకొరియా హెచ్చరిక

శాంతిచర్చలకు బీటలు

సియోల్‌: అమెరికా, ఉత్తరకొరియాల మధ్య ప్రారంభమైన శాంతిచర్చలకు బీటలు వారుతున్నాయి. తమపై విధించిన తీవ్రమైన ఆర్థిక ఆంక్షలను ఎత్తివేయకుంటే మళ్లీ అణ్వస్త్రాల తయారీని ప్రారంభిస్తామని ఉ.కొరియా అమెరికాను హెచ్చరించింది. ఇప్పటికైనా అమెరికా తన నిర్ణయాన్ని మార్చుకోవాలని సూచించింది. ఈ మేరకు ఉ.కొరియా విదేశాంగ శాఖ చెప్పినట్లు అధికారిక వార్తాసంస్థ కేఎన్‌సీఏ తెలిపింది. ఉ.కొరియాను అభివృద్ధి పథంలో నడిపేదిశగా ఆ దేశాధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ అణు, క్షిపణి పరీక్షలను 2018, ఏప్రిల్‌లో నిలిపివేశారు. ఇక సోషలిస్టు ఆర్థిక వ్యవస్థ నిర్మాణంపై దృష్టి సారిస్తామని ప్రకటించారు.

అందులో భాగంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో ఆరు నెలల క్రితం సింగపూర్‌లోని ఓ హోటల్‌లో సమావేశమై కొరియా ద్వీపకల్పం లో శాంతిస్థాపనపై చర్చించారు. పరస్పరం విశ్వాసం నెలకొల్పడం భాగంగా పంగ్యే–రీ అణు పరీక్షా కేంద్రాన్ని సైతం ధ్వంసం చేశారు. అయితే పూర్తిస్థాయిలో అణ్వస్త్రాలను త్యజించేవరకూ ఆంక్షలను ఎత్తివేయబోమని అమెరికా స్పష్టం చేయడంతో కిమ్‌ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అమెరికా తీరు గ్యాంగ్‌స్టర్‌ తరహాలో ఉందన్నారు. తాజాగా ఆర్థిక ఆంక్షల ను ఎత్తివేయకుంటే అణు కార్యక్రమం తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని స్పష్టం చేశారు.
 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top