కిమ్‌పై ఆసక్తికర కథనం

North Korea Media on Kim Super natural powers - Sakshi

ప్యొంగ్‌యాంగ్‌ : వరుసగా అణ్వస్త్ర ప్రయోగాలు.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌పై తీవ్ర వ్యాఖ్యలు... ప్రపంచానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న ఉత్తర కొరియా నియంతాధ్యక్షుడు కిమ్‌ జంగ్‌ ఉన్‌ గురించి ఓ ఆసక్తికర కథనం.  ఉత్తర కొరియా అధికార మీడియా 'కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజన్సీ' కిమ్‌కు అతీత శక్తులు ఉన్నాయంటూ ఓ పెద్ద వ్యాసాన్నే ప్రచురించింది. 

ఇటీవలె ఆయన 9 వేల అడుగుల ఎత్తున్న మౌంట్‌ పక్తూ పర్వతాన్ని అధిరోహించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో చిరునవ్వులు చిందిస్తున్న కిమ్‌ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. అంత దూరం ఎక్కినా.. కాస్త కూడా అలసి పోయినట్టు కనిపించక పోవడం వెనుక కిమ్‌కున్న సూపర్ పవర్స్ కారణమంట. మూడేళ్ల వయసులోనే ఆయన కారును నడిపారని, 9 సంవత్సరాల వయసులో సెయిలర్ గా పోటీ పడ్డారని ఆ కథనం పేర్కొంది.

అంతేకాదు వాతావరణ నియంత్రణా శక్తులు కూడా ఆయనకు ఉన్నాయని... ఎండ కావాలని కోరితే ఎండ ఉంటుందని, వర్షం కావాలనుకుంటే వర్షాలు కురుస్తాయని తెలిపింది. కిమ్‌ ఆధ్వర్యంలో ఉత్తర కొరియా శాస్త్రవేత్తలు ఓ సరికొత్త ఔషధాన్ని కూడా తయారు చేశారంట. ఎయిడ్స్, ఎబోలా సహా ఎన్నో రకాల క్యాన్సర్లు, నపుంసకత్వం, గుండె జబ్బులను నయం చేస్తుందని, యాంటీ రేడియో యాక్టివ్ గానూ పని చేస్తుందని అందులో వివరించింది. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top