విదేశీ నేతల్ని పిలవట్లేదు

No foreign leaders to be invited - Sakshi

ఇమ్రాన్‌ ప్రమాణస్వీకార కార్యక్రమంపై పాక్‌

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌ తెహ్రీక్‌ ఇ ఇన్సాఫ్‌(పీటీఐ) అధినేత ఇమ్రాన్‌ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని మోదీసహా విదేశీ నేతలెవరినీ ఆహ్వానించడం లేదని పాక్‌ విదేశాంగశాఖ తెలిపింది. పాక్‌ ప్రధానిగా తన ప్రమాణ స్వీకారం నిరాడంబరంగా సాగాలని ఇమ్రాన్‌ కోరుకుంటున్నట్లు వెల్లడించింది. 11న అధ్యక్ష భవనంలో ఇమ్రాన్‌ చేత అధ్యక్షుడు మమ్నూన్‌  ప్రమాణం చేయిస్తారు. ఈ వేడుకకు రావాల్సిందిగా ఇమ్రాన్‌ స్నేహితులైన కొంతమంది విదేశీయులకే ఆహ్వానాలు పంపారు.   జూలై 25న జరిగిన పాక్‌ జాతీయ అసెంబ్లీ ఎన్నికల్లో పీటీఐ 116 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. మరోవైపు కేంద్రం అనుమతిస్తే ఇమ్రాన్‌ ప్రమాణస్వీకారానికి తాను హాజరవుతానని పంజాబ్‌ మంత్రి నవ్‌జ్యోత్‌సింగ్‌ సిద్ధూ తెలిపారు. ఇరుదేశాల మధ్య సంబంధాలు మెరుగుపడితే వచ్చే ఏడాది పాక్‌లోని నన్‌కనా సాహిబ్‌లో జరిగే గురునానక్‌ 550వ జయంతి ఉత్సవాలకు హాజరవ్వాలన్న తన కల నెరవేరుతుందన్నారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top