ఆ గ్రహశకలంతో ముప్పులేదు!

ఫిబ్రవరి 4న భూమికి అత్యంత సమీపంగా ఆస్టరాయిడ్
ఢీకొనే అవకాశాలు ఏమాత్రం లేవని నాసా స్పష్టీకరణ
హ్యూస్టన్: ‘ఎటువంటి వదంతులను నమ్మొద్దు. ఫిబ్రవరి 4న భూమికి ఎటువంటి ముప్పులేద’ని చెబుతున్నారు నాసా శాస్త్రవేత్తలు. ఇంతకీ అసలు విషయమేంటంటే.. ఓ పెద్ద ఆస్టరాయిడ్ భూమి వైపు దూసుకొస్తోంది. వచ్చే నెలలో భూమికి అత్యంత సమీపం నుంచి ఈ గ్రహశకలం వెళ్లిపోతుందని నాసా సైంటిస్టులు చెబుతున్నారు. భూమి మీదున్న అతి పెద్ద బిల్డింగ్ అయిన బుర్జ్ ఖలీఫా కంటే కూడా ఈ ఆస్టరాయిడ్ పెద్దదట. దీనికి 2002 అఒ129గా పేరు పెట్టేశారు.
ఫిబ్రవరి 4న భూమికి 26 లక్షల మైళ్ల దూరం నుంచి ఈ గ్రహ శకలం వెళ్లనున్నట్లు అంచనా వేస్తున్నారు. ఇంత దూరం కూడా చాలా దగ్గరే అని నాసా చెబుతోంది. 1.1 కిలోమీటర్ల పొడువున్న ఆస్టరాయిడ్ భూమిని ఢీకొనే అవకాశాలు లేవని, ఒకవేళ ఢీకొంటే.. అది భూమి మొత్తాన్ని కప్పేసేంత దుమ్ము ధూళిని వెదజల్లుతుందని, దీనివల్ల భూగ్రహం మొత్తం అంధకారమవుతుందని నాసా తెలిపింది. విశ్వంలో ఓ నిర్ణీత కక్ష్య లేకుండా తిరిగేవే ఈ గ్రహ శకలాలు.