
అక్రమ వలసదారులను పంపిస్తాం: ట్రంప్
తను అధికారంలోకి వస్తే అమెరికాలో అక్రమంగా వలసవచ్చిన వారిని క్రమబద్ధీకరించే అవకాశమే లేదని..
వాషింగ్టన్: తను అధికారంలోకి వస్తే అమెరికాలో అక్రమంగా వలసవచ్చిన వారిని క్రమబద్ధీకరించే అవకాశమే లేదని.. అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. అక్రమంగా వచ్చేవారికి అడ్డుకట్ట వేసి, ఇప్పటికే వచ్చిన వారికి బహిష్కరిస్తామన్నారు. ఇలా వచ్చిన వారే డ్రగ్ డీలర్లుగా మారుతున్నారన్నారు. ప్రస్తుత చట్టాలతో ఒబామా అందరినీ దేశంలోకి ఆహ్వానించారన్నారు. కాగా, ట్రంప్ వ్యాఖ్యలను హిల్లరీ క్లింటన్ ఖండించారు. విద్వేశపూరిత వ్యాఖ్యలు చేసే ట్రంప్ ఎప్పటికీ మారడన్నారు. అమెరికాలో 1.1 కోట్ల మంది విదేశీయులు అక్రమంగా ఉంటుండగా.. ఇందులో భారతీయులు కూడా పెద్ద సంఖ్యలోనే ఉన్నారు.