రష్యా ఫస్ట్‌ లేడీ కబేవా? | A new Russian first lady.. Putin hints | Sakshi
Sakshi News home page

Dec 23 2018 10:23 AM | Updated on Dec 23 2018 10:34 AM

A new Russian first lady.. Putin hints - Sakshi

రష్యా ప్రథమ మహిళ ఎవరు? అధ్యక్షుడు వ్లాదిమర్‌ పుతిన్‌ ఎవరితో కలసి పెళ్లిపీటలు ఎక్కబోతున్నారు? ఇప్పుడు ఇదే హాట్‌ టాపిక్‌. త్వరలోనే తాను వివాహం చేసుకునే అవకాశం ఉంద ని పుతిన్‌ స్పష్టం చేయడంతో పెళ్లికూతురు ఎవరా అన్న ఉత్కంఠ రేకెత్తింది. 66 ఏళ్ల పుతిన్‌ వ్యక్తిగత విషయాలను ఎప్పుడూ బహిర్గతం చేయరు. కానీ దేశానికి ప్రథమ మహిళ లేకపోవడం లోటుగా అందరూ భావిస్తున్న వేళ ఆయన మళ్లీ పెళ్లికి సంకేతా లివ్వడం అందరిలోనూ ఆసక్తి పెంచింది. పుతిన్‌ 1983లో ల్యూడ్మిలాను పెళ్లి చేసుకున్నారు. 2013లో ఆమెతో విడాకులు తీసుకున్నారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు. ఆయన వ్యక్తిగత జీవితంపై చాలా వదంతులు వచ్చాయి. మాజీ జిమ్నాస్ట్‌ అలీనా కబేవాతో పుతిన్‌ సహజీవనం చేస్తున్నట్టు ఒక రష్యన్‌ పత్రిక ప్రచురించింది. అప్పట్లో ఈ వార్తని పుతిన్‌ ఖండించినా.. ఇప్పుడు ఆయనే స్వయంగా పెళ్లి చేసుకుంటానని వెల్లడించడంతో కబేవాయే పెళ్లికూతురని రష్యా మీడియా కోడై కూస్తోంది.

ఎవరీ అలీనా కబేవా?
అలీనా కబేవా 1983లో అప్పటి సోవియెట్‌ యూనియన్‌లో అంతర్భాగమైన ఉజ్బెకిస్తాన్‌లో ఒక క్రీడా కుటుంబంలో జన్మించారు. ఆమె తండ్రి ఫుట్‌బాల్‌ ప్లేయర్‌. మూడేళ్ల వయసునుంచే రిథమిక్‌ జిమ్నాస్టిక్స్‌ చేస్తున్నారు. టీనేజ్‌ వచ్చేసరికి ఆ క్రీడలో అద్భుతంగా రాణించారు. రష్యా తరఫున ఎన్నో అంతర్జాతీయ పోటీల్లో పాల్గొన్నారు. 2004 ఏథెన్స్‌ గేమ్స్‌లో గోల్డ్‌మెడల్‌ సాధించారు. క్రీడా ప్రతిభతో పాటు కబేవా కళ్లుతిప్పుకోలేని అందం ఆమెకు రష్యా సమాజంలో ఒక గుర్తింపును తెచ్చాయి. వోగ్‌ రష్యా వంటి మ్యాగజైన్‌ కవర్‌పేజీపై ఆమె ఫొటోలు దర్శనమిచ్చాయి. ఆ తర్వాత కబేవాను వరల్డ్‌ రిథమిక్‌ జిమ్నాస్టిక్స్‌ చాంపియన్‌షిప్‌కు అంబాసిడర్‌ గా నియమితులయ్యారు. అయితే అప్పట్లోనే రష్యా జిమ్నాస్ట్‌లు డోపింగ్‌ ఆరోపణలు ఎదుర్కోవడంతో కబేవా ఇరుకునపడ్డారు. ఆ తర్వాత కబేవా జిమ్నాస్టిక్స్‌ను వదిలేసి ఒక మీడియా హౌస్‌ను రన్‌ చేస్తూ రష్యా ప్రభుత్వానికి అనుకూల వైఖరిని ప్రదర్శించారు. 2008లోనే పుతిన్‌తో కబేవా ప్రేమాయణం బయటకు వచ్చింది.. 2013లో పుతిన్‌ విడాకులు తీసుకున్నాక కబేవాతో సహజీవనం చేస్తున్నారన్న వార్తలు గుప్పుమన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement