కర్మ: తల్లిదండ్రులతో పోర్న్‌ చూసినట్లుంది! | Netizens Comments On Watching Polish Movie 365 DNI On Netflix | Sakshi
Sakshi News home page

కర్మ: తల్లిదండ్రులతో పోర్న్‌ చూసినట్లుంది!

Jun 12 2020 1:57 PM | Updated on Jun 12 2020 4:09 PM

Netizens Comments On Watching Polish Movie 365 DNI On Netflix - Sakshi

సినిమాలోని కొన్ని శృంగార దృశ్యాలు

అనుకోకుండా తల్లిదండ్రులతో నెట్‌ఫ్లిక్స్‌లో పోలిష్‌ సినిమా ‘‘365 డీఎన్‌ఐ’’ చూసిన కొందరికి వింత అనుభవం ఎదురైంది. అదో శృంగార సినిమా అని తెలీక టీవీ ముందు కూర్చున్నందుకు నరకం అనుభవించామని 365 డీఎన్‌ఐ బాధితులు వాపోయారు. శృంగార సన్నివేశాలు వచ్చిన ప్రతీ సారి లోపల సిగ్గుతో చచ్చిపోయామని పేర్కొన్నారు. తల్లిదండ్రులతో పోర్న్‌ సినిమా చూస్తున్న అనుభవాన్ని పొందామంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అమ్మానాన్నలతో కలిసి సినిమా చూసిన అనుభవాలను ట్విటర్‌ వేదికగా పంచుకున్నారు. ( ప్రాణ భయంతో పరుగులు పెట్టాం: నటి )

నెటిజన్ల కామెంట్లు..

‘‘నేను ఈ సినిమాను మా తల్లిదండ్రులతో కలిసి చూశాను. కర్మ! అమ్మానాన్నలతో కలిసి పోర్న్‌ సినిమా చూస్తున్నట్లుగా అనిపించింది’’.. ‘‘నేను మా అమ్మతో కలిసి ఈ సినిమా చూశాను. లోపల సిగ్గుతో చచ్చిపోయాను.. జాస్మిన్’’.. ‌‘‘  ఆ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో ట్రెండ్‌ అవుతుంటే బాగుంటుంది కదా పెట్టాను. అంతే!..’’.. ‘‘ నేను మా నాన్న ఇంట్లో ఉండగా ఆ సినిమా పెట్టాను. అది చూస్తున్నప్పుడు ‘ ఏంటది? ఇంతకీ అది మంచి సినిమానేనా?’అని అడిగారు నాన్న. ‘ నాకు తెలీదు నాన్న.. బోరింగ్‌గా ఉంది’ అన్నాను. ఏం చెప్పాలో తెలియక’’ అంటూ వాపోయారు. ప్రస్తుతం ఈ కామెంట్లు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి.

Advertisement
 
Advertisement
Advertisement