ఎవరెస్ట్‌.. ఇక అందరూ ఎక్కలేరు!

Nepal Says Everest Rules Might Change After Traffic Jams and Deaths - Sakshi

కాఠ్మండు: ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ఎవరెస్ట్‌ శిఖరాన్ని ఇకపై ఎవరు పడితే వారు అధిరోహించే అవకాశం లేదు. ఎవరెస్ట్‌ శిఖరంపై పర్వతారోహకుల మరణాలు, ట్రాఫిక్‌ జామ్‌ నేపథ్యంలో ఎవరెస్ట్‌ అధిరోహణపై కొన్ని నిబంధనలు విధించాలని నేపాల్‌ పర్యాటక శాఖ ఆలోచిస్తుంది. అధిరోహకులకు కనీస అర్హతలు ఉండేలా చూడనుంది. ఎక్కువ తాళ్ల ఏర్పాటు, ఆక్సిజన్, ఎక్కువ షెర్పాలను తీసుకెళ్లడం వంటి నిబంధనలు తీసుకురానున్నట్లు నేపాల్‌ పర్యాటక మంత్రిత్వ శాఖ అధికారి చెప్పారు. టిబెట్‌ ప్రభుత్వం కేవలం 300 మందికి ఎవరెస్ట్‌ను అధిరోహించే అవకాశం కల్పిస్తుండగా నేపాల్‌ అపరిమితంగా పర్వతారోహకులకు అనుమతి మంజూరు చేస్తోంది.

11 వేల కిలోల చెత్త: ఎవరెస్ట్‌ను శుద్ధి చేసేందుకు నేపాల్‌ ప్రభుత్వం రెండు నెలల పాటు నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమం సందర్భంగా మొత్తం 11 వేల కిలోల చెత్తతో పాటు నాలుగు మృతదేహాలను వెలికి తీశారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top