చందమామ గురించి కొత్త విషయం

NASA study reveals something extraordinary about the history of our MOON

వాషింగ్టన్‌ : చందమామ గురించి నాసా సరికొత్త విషయాన్ని వెల్లడించింది. మూడు నుంచి నాలుగు బిలియన్ల సంవత్సరాలకు పూర్వం చంద్రుడిపై వాతావరణం ఉండేదని చెప్పింది. చంద్రుడిపై బద్దలైన అగ్ని పర్వత జాడల ద్వారా ఈ విషయాన్ని ధ్రువీకరించుకున్నట్లు తెలిపింది.

అగ్నిపర్వతాల విస్ఫోటనల వల్ల వెలువడిన కార్బన్‌ మోనాక్సైడ్‌ చంద్రుడి చుట్టూ ఓ పొరలా ఏర్పడి 70 మిలియన్‌ సంవత్సారాల పాటు అలానే ఉన్నట్లు వెల్లడించింది. ఈ మేరకు ఎర్త్‌ అండ్‌ ప్లానెటరీ సైన్స్‌ లెటర్స్‌ జర్నల్‌లో ఓ కథనం ప్రచురితమైంది. కార్బన్‌ మోనాక్సైడ్‌తో పాటు సల్ఫర్‌, నీరు కూడా చంద్రుడి వాతావరణంలో ఉన్నట్లు నాసా కథనంలో వివరించింది.

అగ్ని పర్వాతాల నుంచి ఉప్పొంగిన లావా ఆనవాళ్లే ప్రస్తుతం మనకు చంద్రునిపై కనిపిస్తున్న నల్లని మచ్చలని తెలిపింది. చంద్రునిపై వాతావరణం ఉన్న సమయంలో  భూమికి ఇప్పటికన్నామూడు రెట్లు చేరువగా ఉందని చెప్పింది.  

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top