ట్రంప్‌ వర్సెస్‌ పెలోసి

Nancy Pelosi Rips Up State Of The Union Speech After Trump Snubs Handshake - Sakshi

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రసంగ ప్రతిని ప్రతినిధుల సభ స్పీకర్‌ నాన్సీ పెలోసి చించేసిన సంచలన ఘటన అమెరికా కాంగ్రెస్‌లో చోటు చేసుకుంది. ట్రంప్‌ను విమర్శించే విషయంలో డెమొక్రాటిక్‌ పార్టీ నేత నాన్సీ ముందుంటారనే విషయం తెలిసిందే. ‘స్టేట్‌ ఆఫ్‌ ది యూనియన్‌’ ప్రసంగం ఇచ్చేందుకు వచ్చిన ట్రంప్‌ను సభకు పరిచయం చేస్తూ.. సాంప్రదాయక పరిచయ వాక్యాలను నాన్సీ వాడలేదు. తర్వాత ప్రసంగం ఇచ్చేందుకు ట్రంప్‌ నిల్చుని, తన ప్రసంగ ప్రతిని నాన్సీ పెలోసికి ఇచ్చారు. ఆ సమయంలో ఆమె ట్రంప్‌తో కరచాలనం చేసేందుకు ప్రయత్నించగా, ట్రంప్‌ పట్టించుకోనట్లుగా వెనక్కు తిరిగారు. ట్రంప్‌ ప్రసంగం ముగించే సమయంలో.. నాన్సీ లేచి నిల్చున తన చేతిలోని ట్రంప్‌ ప్రసంగం కాపీని అడ్డంగా చింపేశారు.  

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top