చైనా నుంచి ప్రమాదకరమైన వైరస్‌

Mysterious Corona Virus From China - Sakshi

వుహాన్‌ నగరాన్ని వణికిస్తున్న వైరస్‌

మనుషుల నుంచే మనషులకు వ్యాప్తి

ప్రాణాంతకమైన నిమోనియాకు కారణమవుతున్న కరోనా వైరస్‌ ఇప్పుడు చైనాలోని వుహాన్‌ నగరాన్ని వణికిస్తోంది. ఈ వైరస్‌ కారణంగా ఇంతవరకు ఆ నగరంలో 40 మంది నిమోనియా బారిన పడగా, వారిలో ఒకరు మరణించారు. ఇటీవల అదే నగరాన్ని సందర్శించిన జపాన్‌కు చెందిన ఓ 30 ఏళ్ల యువకుడికి కూడా ఈ వైరస్‌ సోకింది. ఈ మేరకు జపాన్‌ అధికారులు బుధవారం నాడు ధ్రువీకరించగా, ఈ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ గురువారం ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చింది. 

వారం క్రితం థాయ్‌లాండ్‌లో ఓ యువతి ఈ వైరస్‌ బారిన పడడం, ఇప్పుడు జపాన్‌ యువకుడికి కూడా అదే వైరస్‌ సోకినట్లు తెలియడంతో ఈ వైరస్‌ ప్రపంచవ్యాప్తంగా విస్తరించే ప్రమాదం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేశారు. ముందుగా ఈ వైరస్‌ జంతువుల నుంచి వ్యాపిస్తుందని అనుమానించారు. ఆ తర్వాత మనుషుల నుంచే మనషులకు వస్తుందని తెలియడంతో ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ విమానాశ్రయాలన్నింటిని అధికారులు అప్రమత్తం చేశారు. 

సెలవుల్లో థాయ్‌లాండ్‌కు వెళ్లిన ఓ చైనా యువతికి ఈ వైరస్‌ సోకినట్లు తెలియగానే, ఆమె అక్కడి ఆస్పత్రిలోని ఓ ప్రత్యేక వార్డులో చేర్పించారు. ఇటీవల చైనాను సందర్శించి వచ్చిన 15 మంది హాంకాంగ్‌ యువకులకు ఈ వైరస్‌ సోకిందో, లేదో తెలుసుకునేందుకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top