మహిళను విమానం నుంచి తోసేశారు! | Muslim woman removed from US plane without credible explanation | Sakshi
Sakshi News home page

మహిళను విమానం నుంచి తోసేశారు!

Apr 18 2016 8:29 PM | Updated on Apr 4 2019 5:12 PM

మహిళను విమానం నుంచి తోసేశారు! - Sakshi

మహిళను విమానం నుంచి తోసేశారు!

అమెరికాలో తల చుట్టు పరదా (హిజాబ్‌) ధరించిన ఓ ముస్లిం మహిళకు చేదు అనుభవం ఎదురైంది.

అమెరికాలో తల చుట్టు పరదా (హిజాబ్‌) ధరించిన ఓ ముస్లిం మహిళకు చేదు అనుభవం ఎదురైంది. ఎలాంటి కారణం చెప్పకుండానే ఆమెను విమానం నుంచి బయటకు తోసేశారు. ఆమె ఉండటం వల్ల విమానంలో తమకు అసౌకర్యంగా ఉందని కుంటిసాకుతో సిబ్బంది ఈ దారుణానికి పాల్పడ్డారు.

మేరిలాండ్‌లో నివాసముండే హకిమా అబ్బుల్లె అనే ముస్లిం మహిళ సౌత్‌వెస్ట్‌ ఎయిర్‌లైన్స్‌ విమానంలో చికాగో నుంచి సీటెల్‌కు బయలుదేరింది. విమానంలో సీటు మార్చుకునే వీలుందా? అని ఆమె సిబ్బందిని అడిగింది. సీటును మార్చడానికి బదులు సిబ్బంది ఆమెనే విమానం నుంచి బయటకు గెంటేశారు. సౌత్‌వెస్ట్‌ ఎయిర్‌లైన్స్‌ విమానంలో ఇలాంటి ఘటన జరుగడం ఇది రెండోసారి. గత నెలలో ఓ ఇరాకీ వ్యక్తి పట్ల కూడా విమాన సిబ్బంది ఇలాగే వ్యవహరించారు. అమెరికన్‌-ఇస్లామిక్ రిలేషన్స్ కౌన్సిల్ అధికారి అయిన జైనాబ్ చౌదరి అరబ్బీలో మాట్లాడినందుకు.. ఆయనను విమానం నుంచి బయటకు పంపించారు.

హకిమాను విమానం నుంచి బయటకు పంపించడంతో ఎయిర్‌పోర్టు పోలీసులు తిరిగి ఆమెను టికెట్‌ కౌంటర్‌ వద్దకు తీసుకొచ్చారు. సోమాలియా మూలాలు ఉన్న ఆమె కొన్ని గంటలపాటు నిరీక్షించిన అనంతరం మరో విమానంలో సీటెల్‌ చేరుకున్నదని హకిమాను ఉటంకిస్తూ ద బాల్టీమోర్ సన్ పత్రిక తెలిపింది. సరైన కారణమేది చెప్పకుండానే తనను విమానం నుంచి బయటకు పంపించారని, ఇది తనకు బాధ కలిగించిందని ఆమె కన్నీటి పర్యంతమవుతూ హికిమా మీడియాకు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement