వైరల్‌: పిల్లి పిల్లపై ప్రేమను కురిపించిన కోతి | Monkey Tries Feeding Banana To Kitten In thailand | Sakshi
Sakshi News home page

వైరల్‌: పిల్లి పిల్లపై ప్రేమను కురిపించిన కోతి

Sep 6 2019 4:08 PM | Updated on Sep 6 2019 5:45 PM

Monkey Tries Feeding  Banana To Kitten In thailand - Sakshi

బ్యాంకాక్‌ : ఎవరైన అల్లరి పనులు చేస్తే కోతి చేష్టలు చేయకంటూ పెద్దలు హెచ్చరిస్తారు. అంటే కోతి అన్ని వింత చేష్టలు చేస్తుందని అర్థం. సాధారణంగా కోతులు తన పిల్లలను కొంత కాలం వరకు ఒంటికి అంటి పెట్టుకొని జాగ్రత్తగా చూసుకుంటాయి. వేరే జంతువులు వాటికి హానీ చేయాలని వస్తే సహించవు. కానీ పిల్లి పిల్లను కోతి దగ్గర చేసి ముద్దాడటం ఎక్కడైనా చూసారా?.. అవునండి ఈ వీడియో చూసిన తర్వాత కోతి మీద మీకున్న అభిప్రాయం మారవచ్చు. 

వివరాలు.. థాయ్‌లాండ్‌లో ఓ కోతి  ఇంట్లో నుంచి పిల్లి పిల్లను అమాంతం ఎత్తుకొని వచ్చి.. కాస్తా దూరం తీసుకెళ్లి దాన్ని ముద్దు చేస్తూ, నిమరడం ప్రారంభించింది. అంతటితో ఆగకుండా దానికి అరటిపండుని తినిపించడానికి ప్రయత్నించింది. అయితే ఆ పిల్లి పిల్ల మాత్రం దాన్ని తినడానికి నిరాకరించింది. కాగా అందరిని ఆశ్చర్యాన్ని కలిగిస్తున్న ఈ వింత దృశ్యం థాయ్‌లాండ్‌లో చోటు చేసుకుంది. దీనిని సమీప వ్యక్తి సెల్‌ఫోన్‌లో చిత్రీకరించి ఫేస్‌బుక్‌లో పోస్టు చేశాడు. ఆగస్టు 31న షేర్‌ చేసిన ఈ వీడియోను అనేక మంది వీక్షించడంతో పాటు లైకులు కొడుతూ కోతిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement