ప్రొఫెట్‌ మహ్మద్‌పై పోస్టు.. హిందూ గ్రామానికి నిప్పు | Mob torches Hindu village after FB post 'defaming' Prophet goes viral | Sakshi
Sakshi News home page

ప్రొఫెట్‌ మహ్మద్‌పై పోస్టు.. హిందూ గ్రామానికి నిప్పు

Nov 11 2017 3:03 PM | Updated on Jul 26 2018 1:02 PM

Mob torches Hindu village after FB post 'defaming' Prophet goes viral - Sakshi

కాక్స్‌బజార్‌ : ప్రొఫెట్‌(మత ప్రభోధకుడు)పై సోషల్‌మీడియాలో అభ్యంతకర పోస్టు చేసిన వ్యక్తి గ్రామానికి దుండగుల గుంపు నిప్పు అంటించింది. ఈ ఘటన శుక్రవారం బంగ్లాదేశ్‌లో చోటు చేసుకుంది. హిందూ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ప్రొఫెట్‌ మహ్మద్‌ను ఉద్దేశించి ఫేస్‌బుక్‌లో అభ్యంతకరంగా పోస్టు చేశాడు. ఆ పోస్టు కాస్తా వైరల్‌గా మారింది. 

దీంతో ఆగ్రహించిన కొందరు గుంపుగా పోస్టు చేసిన వ్యక్తి గ్రామానికి వెళ్లి ఊళ్లోని ఇళ్లకు నిప్పు పెట్టారు. ఈ ఘటనలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోగా.. ఆరుగురు గాయాలపాలయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్ధలికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు యత్నించారు. పరిస్థితి చేయి దాటిపోతుండటంతో టియర్‌ గ్యాస్‌ షెల్స్‌, రబ్బర్‌ బుల్లెట్లను వినియోగించారు. అప్పటికే గ్రామంలోని 30కి పైగా ఇళ్లు కాలిబూడిదయ్యాయి. 

పోలీసులు రబ్బర్‌ బుల్లెట్లను ప్రయోగించడంపై ఆగ్రహించిన దాడికి పాల్పడిన గుంపులోని వ్యక్తులు రంగ్‌పూర్‌ - దినాజ్‌పూర్‌ హైవేపై రాస్తారోకోకు దిగారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement