దిగ్గజ కంపెనీ భారీ కుంభకోణం!

దిగ్గజ కంపెనీ భారీ కుంభకోణం!


టోక్యో: కంపెనీకి చెందిన కార్ల కుంభకోణంలో తలెత్తిన ఆరోపణలతో జపాన్ ఆటో మొబైల్ దిగ్గజ సంస్థ మిత్సుబిషి మోటార్స్ ప్రెసిడెంట్ టెస్టురో ఐకావా రాజీనామా చేయనున్నాడు. ఫ్యూయల్ ఎకానమీ డాటా స్కామ్ వల్ల కంపెనీకి చెందిన 4 రకాల మినీ కార్ల విషయంలో భారీ అవకతవకలు జరిగాయన్ విషయం తెలిసిందే. ఐకావా రాజీనామా చేయనున్నట్లు అధికారులు బుధవారం వెల్లడించారు. స్థానిక మీడియా కథనం ప్రకారం.. కంపెనీ సీఈవో ఒసాము మసుకో తాత్కాలికంగా ప్రెసిడెంట్ బాధ్యతలను నిర్వహించనున్నాడు. గత వారమే డైరెక్టర్లు ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఫ్యూయల్ వివరాలు వెల్లడిలో కంపెనీ భారీ మోసాలకు పాల్పడడంతో గత కొన్ని రోజుల నుంచి ఈ కంపెనీపై కుంభకోణం ఆరోపణలు వస్తున్నాయి. దర్యాప్తు ప్రాథమిక నివేదికలో కుంభకోణం జరిగినట్లు రుజువైంది.జపాన్ ఆటోమొబైల్ తయారీ సంస్థ నిస్సాన్ మోటార్స్ 34 శాతం వాటాను 200 కోట్ల డాలర్లకు కొనుగోలు చేసి మిత్సుబిషిలో అతిపెద్ద వాటాదారుగా మారనుంది. 660 క్యూబిక్ సెంటీమీటర్ల కంటే తక్కువ ఉండే ఇంజిన్లున్న 6.25 లక్షల మినీ వెహికల్స్ ఇంధన వినియోగం వివరాలలో లెక్కలు తారుమారయ్యాయి. ఈ కార్లను జపాన్ మార్కెట్లోనే విక్రయించారు. ఇంధనం విషయంపై పలు ఆరోపణలు రావడంతో ఇన్వెస్టిగేషన్ చేయగా, మరికొన్ని రకాల మోడల్ కార్లకు ఇలాంటి రకమైన ఇంజిన్లనే అమర్చినట్లు తేలింది. ప్రొడక్టల్ మేనేజ్ మెంట్ విభాగంలో కెరీర్ మొదలుపెట్టిన ఐకావా, ఆ తర్వాత డాటా మనిపులేషన్ యూనిట్ కు చీఫ్ గా బాధ్యతలు చేపట్టాడు. నేడు ఆ కంపెనీ జపాన్ రవాణాశాఖకు తమ నూతన నివేదిక అందించనుంది. పూర్తిస్థాయి నివేదిక అందితే ఐకావా ఆ సంస్థ నుంచి ఎలాంటి సంబంధాలు లేకుండా మిస్టుబిషి మోటార్స్ నుంచి తప్పుకుంటాడు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top