యూరప్‌లో ఆగని మూకుమ్మడి రేప్‌లు
మిడిల్ ఈస్ట్ దేశాల నుంచి లక్షలాదిగా తరలివచ్చిన శరణార్థుల సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న యూరప్ దేశాలు ఇప్పుడు ఊహించని మరో దారుణ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి.
హెల్సింకీ: మిడిల్ ఈస్ట్ దేశాల నుంచి లక్షలాదిగా తరలివచ్చిన శరణార్థుల సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న యూరప్ దేశాలు ఇప్పుడు ఊహించని మరో దారుణ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. యూరప్ మహిళలపై శరణార్థులు సాగిస్తున్న నిత్య అత్యాచార కృత్యాలకు తల్లడిల్లిపోతున్నాయి. నూతన సంవత్సరం వేడుకల వేళ జర్మనీలోని కొలోగ్నీ నగరంలో ప్రారంభమైన మూకుమ్మడి రేప్‌లు ఆస్ట్రియా, స్విడ్జర్లాండ్, స్వీడన్, ఫిన్లాండ్ దేశాలకు పాకాయి. జర్మనీలో దాదాపు 150 మంది మహిళలపై మూకుమ్మడి రేప్‌లు జరగ్గా, ఫిన్లాండ్ రాజధాని నగరం హెల్సింకీలో తాజాగా 50 మంది మహిళలపై రేప్‌లు జరిగాయి. ఆస్ట్రియా, స్వీడన్ దేశాల్లో పాతిక సంఖ్యలో రేప్‌లు నమోదయ్యాయి. ఆడవాళ్లు రాత్రి వేళల్లో ఇంటి నుంచి వీధుల్లోకి రాకూడదని, సమస్యాత్మక ప్రాంతాలకు అసలు వెళ్లరాదని, క్లబ్‌లు, పబ్‌లు అంటూ తిరగరాదంటూ ఫిన్లాండ్ పోలీసులు ఆదేశాలు జారీచేశారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.
మూకుమ్మడి రేప్‌లకు పాల్పడుతున్నవారిలో 95 శాతం మంది శరణార్థులే కావడం గమనార్హం. కేవలం ఐదుశాతం మందే స్థానికులు ఉంటున్నారు. బాధిత మహ ళలంతా స్థానికులే. శరణార్థుల్లో 20 నుంచి 30 ఏళ్లలోపున్న వారే రేప్‌లకు పాల్పడుతున్నారని యూరప్ దేశాల అధికారులు తెలియజేశారు. నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా డిసెంబర్ 31వ తేదీన జరిగిన మూకుమ్మడి రేప్ సంఘటనల్లో జర్మనీ పోలీసులు 30 మందిని అరెస్టు చేయగా, వారిలో 9 మంది అల్జీరియన్లు, 8 మంది మొరోకాన్లు, ఐదుగురు ఇరాకీయులు, నలుగురు సిరియన్లు, ఇద్దరిని జర్మన్లుగా గుర్తించారు. డిసెంబర్ 31న జరిగిన రేప్ సంఘటనలను జర్మనీతోపాటు, ఆస్ట్రియా దేశాలు వారం రోజులపాటు గుట్టుగా ఉంచాయి. దేశం పరవు పోతుందని, టూరిజం దెబ్బతింటుందని, మహిళల్లో అభద్రతా భావం పెరుగుతుందనే ఆందోళనతోనే తాము ఈ సంఘటనలను గుట్టుగా ఉంచాల్సి వచ్చిందని ఆయా దేశాలు చెబుతున్నాయి. రేప్‌లకు వ్యతిరేకంగా పౌర సంఘాలు, మహిళా సంఘాలు వీధుల్లోకి వచ్చి ప్రదర్శనలు జరుపుతున్నాయి. శరణార్థుల్లో సామాజిక మార్పు తీసుకరావడం వల్ల రేప్‌లను అరికట్టవచ్చని భావించిన నార్వేకు చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ శరణార్థుల కోసం ‘సమాజం-సంస్కృతి’ అనే అంశంపై ఉచితంగా కోర్సులను ఆఫర్ చేస్తోంది.
అసలు రేప్‌లు ఎందుకు జరుగుతున్నాయి?
యూరప్ మహిళలు స్కర్టులు ధరించి స్వేచ్ఛగా నైట్ క్లబ్బులకు, పబ్‌లకు వెళ్లడాన్ని శరణార్థులు జీర్ణించుకోలేక పోవడమా? యూరప్ అంటే తరతరాలుగా తమలో పేరుకున్న విద్వేశ భావమా? ఒక జాతి మరోజాతిని చూసి ఓర్వలేక పోవడమా? పుట్టి పెరిగిన మాతృగడ్డను వదిలిపెట్టి వచ్చినందుకు తమలో కలిగే తెలియని ఆక్రోశమా? శరణార్థుల రూపంలో వచ్చిన నేరచరితులే కారణమా? ఇలా అన్ని కోణాల నుంచి యూరప్ దేశాలు ఇప్పుడు మూకుమ్మడి రేప్‌లపై దర్యాప్తు జరపుతున్నాయి.


