ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన డ్రగ్ డాన్ జోక్విన్ ఎల్ ఛాపో గుజ్‌మన్ (56) మెక్సికోలో అరెస్ట్ అయ్యాడు. గుజ్‌మన్ ఆచూకీ తెలిపిన వారికి దాదాపు రూ.31కోట్ల నగదును రివార్డుగా అందిస్తామని అమెరికా గతంలో ప్రకటించింది.
వాషింగ్టన్: ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన డ్రగ్ డాన్ జోక్విన్ ఎల్ ఛాపో గుజ్‌మన్ (56) మెక్సికోలో అరెస్ట్ అయ్యాడు. గుజ్‌మన్ ఆచూకీ తెలిపిన వారికి దాదాపు రూ.31కోట్ల నగదును రివార్డుగా అందిస్తామని అమెరికా గతంలో ప్రకటించింది. మెక్సికో మెరైన్స్, అమెరికా డ్రగ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అడ్మినిస్ట్రేషన్ ఏజెంట్లు జాయింట్ ఆపరేషన్ నిర్వహించి గుజ్‌మన్ మెక్సికోలోని మజాత్లాన్‌లో శనివారం అరెస్ట్ చేశారు. మొత్తం 13 మందిని అరెస్ట్ చేశామని, భారీ గా ఆయుధాలు సీజ్ చేశామని అధికారులు తెలి పారు.
సెల్‌ఫోన్, ఇతర సమాచారం సహా యంతో గుజ్‌మన్ జాడ కనిపెట్టినట్టు చెప్పారు. గుజ్‌మన్ కోసం 13 ఏళ్లుగా ప్రపంచ దేశాలు గాలి స్తున్నాయి. ప్రజలను మత్తుపదార్థాలకు బానిసలుగా చేయడం, వేలాది మందిని చంపడం, అవినీ తికి సంబంధించి గుజ్‌మన్‌పై అనేకదేశాల్లో వందలాది కేసులున్నాయి.