కిమ్‌తో భేటీకి ఎదురుచూస్తున్నా: ట్రంప్‌

Meeting between Donald Trump and Kim Jong Un could take place - Sakshi

వాషింగ్టన్‌: ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్‌తో ముందుగా నిర్ణయించిన ప్రకారమే సమావేశం జరిగే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ చెప్పారు. భేటీకి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయని వెల్లడించారు. ‘సింగపూర్‌లో జూన్‌ 12వ తేదీ సమావేశం కోసం మేం ఎదురుచూస్తున్నాం.  చూద్దాం..ఏం జరుగుతుందో..’అని  ట్రంప్‌ వ్యాఖ్యానించారు. ‘మా సమావేశం కోసం, మేం తీసుకునే నిర్ణయం కోసం ప్రజలంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కొరియా ద్వీపకల్పంలో అణు నిరాయుధీకరణ ఉత్తరకొరియాకు ఎంతో మేలు చేస్తుంది’ అని అన్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top