గురుడిపై భారీ తుపాను!

గురుడిపై భారీ తుపాను!


వాషింగ్టన్‌: అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ప్రయోగించిన ‘జూనో’అంతరిక్ష నౌక గురుగ్రహంపై భారీ తుపాను ‘గ్రేట్‌ రెడ్‌ స్పాట్‌’ఫొటోలను పంపింది. ఈ గ్రేట్‌ రెడ్‌ స్పాట్‌ను సౌర కుటుంబంలోనే అతిపెద్దదిగా శాస్త్రవేత్తలు అభివర్ణిస్తారు. జూలై 10న నౌకలోని జూనోక్యామ్‌ అనే పరికరం ఈ అతిపెద్ద తుపాను ఫొటోలను తీసింది. వందల ఏళ్ల నుంచి శాస్త్రవేత్తలు ఈ తుపానును పరిశీలిస్తున్నారని శాన్‌ ఆంటోనియోలోని సౌత్‌వెస్ట్‌ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన స్కాట్‌ బోల్టన్‌ పేర్కొన్నారు.


‘ఈ తుఫానుకు సంబంధించి చాలా మెరుగైన ఫొటోలు మా వద్ద ఉన్నాయి. వీటిని విశ్లేషించడానికి మాకు కొంత సమయం పడుతుంది’అని ఆయన వివరించారు. ఈ గ్రేట్‌ రెడ్‌ స్పాట్‌ దాదాపు 16,350 కిలోమీటర్ల వెడల్పు ఉంటుంది. అంటే భూమి వెడల్పుతో పోల్చుకుంటే దాదాపు 1.3 రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఈ తుపానును 1830వ సంవత్సరం నుంచి గమనిస్తూ ఉన్నారు. 350 ఏళ్ల నుంచి ఇది ఉండొచ్చని అంచనా.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top