8 మంది ఉగ్రవాద అనుమానితుల అరెస్ట్ | Malaysia detains 8 terror suspects | Sakshi
Sakshi News home page

8 మంది ఉగ్రవాద అనుమానితుల అరెస్ట్

Nov 2 2015 1:55 PM | Updated on Sep 3 2017 11:54 AM

మలేసియాలో ఉగ్రవాదులుగా అనుమానిస్తున్న 8 మందిని పోలీసులు అరెస్టు చేశారు.

కౌలాలంపూర్: మలేసియాలో ఉగ్రవాదులుగా అనుమానిస్తున్న 8 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు ఉండడం గమనార్హం. నిందితులంతా 22 నుండి 36 సంవత్సరాల వయసు గల వారిగా మలేసియా పోలీసు అధికారి తెలిపారు. అరెస్టు చేసిన వారిలో ఆరుగురిని 'టాండ్జిమ్ అల్ ఖైదా' ఉగ్రవాద సంస్థకు చెందిన వారిగా గుర్తించారు. మరో ఇద్దరికి ఇస్లామిక్ స్టేట్తో సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. గత ఆగస్టులో కూడా ఇద్దరు సివిల్ సర్వెంట్లకు ఇస్లామిక్ స్టేట్తో సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు. ప్రస్తుతం గుర్తించిన ఇద్దరు సివిల్ సర్వెంట్లు అదే వింగ్కు చెందినవారుగా అనుమానిస్తున్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement