ట్రంప్‌ వద్దు.. ఒబామానే కావాలి..! | Majority of Americans want Obama back as President: poll | Sakshi
Sakshi News home page

ట్రంప్‌ వద్దు.. ఒబామానే కావాలి..!

Feb 4 2017 1:20 AM | Updated on Apr 4 2019 5:04 PM

ట్రంప్‌ వద్దు.. ఒబామానే కావాలి..! - Sakshi

ట్రంప్‌ వద్దు.. ఒబామానే కావాలి..!

మళ్లీ బరాక్‌ ఒబామానే అమెరికా అధ్యక్షునిగా కావాలని మెజారిటీ అమెరికన్లు కోరుకుంటున్నారట.

పబ్లిక్‌ పాలసీ సర్వేలో వెల్లడి
వాషింగ్టన్ : మళ్లీ బరాక్‌ ఒబామానే అమెరికా అధ్యక్షునిగా కావాలని మెజారిటీ అమెరికన్లు కోరుకుంటున్నారట. అమెరికాలో పబ్లిక్‌ పాలసీ పోలింగ్‌ సంస్థ నిర్వహించిన సర్వేలో వెల్లడైన విషయమిది. ఒబామా అధ్యక్షునిగా ఉన్న నాటి రోజులే బాగున్నాయని 52 శాతం మంది అభిప్రాయపడగా.. ట్రంప్‌ పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేసిన ఓటర్ల సంఖ్య 43 శాతమే కావడం విశేషం.

  40 శాతం మంది ఓటర్లు ట్రంప్‌ను అభిశంసించాలని డిమాండ్‌ చేస్తున్నారు. వారం క్రితం వీరి సంఖ్య 35 శాతమే ఉండగా.. ఇప్పుడు అది 5 శాతం పెరగడం విశేషం. 48 శాతం మంది మాత్రమే ట్రంప్‌ అభిశంసనను వ్యతిరేకిస్తున్నట్టు సర్వే వెల్లడించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement