వద్దనుకున్న అదృష్టం తలుపు తడితే... | Lucky lottery | Sakshi
Sakshi News home page

వద్దనుకున్న అదృష్టం తలుపు తడితే...

Nov 6 2016 3:56 AM | Updated on Sep 4 2017 7:17 PM

వద్దనుకున్న అదృష్టం తలుపు తడితే...

వద్దనుకున్న అదృష్టం తలుపు తడితే...

లాటరీ టికెట్లు కొని డబ్బు వృథా చేస్తున్నాడని భర్తతో అమెరికాలో నార్త్ కరోలినాకు చెందిన ఓ మహిళ ఎప్పుడూ గొడవ పడుతూ ఉండేది.

లాటరీ టికెట్లు కొని డబ్బు వృథా చేస్తున్నాడని భర్తతో అమెరికాలో నార్త్ కరోలినాకు చెందిన ఓ మహిళ ఎప్పుడూ గొడవ పడుతూ ఉండేది. భర్త తీరు చూసి విసిగిపోయిన ఆమె తగిన గుణపాఠం చెప్పాలని నిర్ణయించుకుంది. లాటరీ టికెట్ల వల్ల డబ్బు దండగే తప్ప లాభం లేదని భర్తకు తెలియజెప్పాలని భావించి కొన్ని లాటరీ టికెట్లు కొని అతనికి ఇచ్చింది. అయితే ఆమె ఊహించనిది జరిగింది. ఆమె కోరుకోకున్నా లాటరీ తగిలింది. లాటరీలో 6.68 కోట్ల రూపాయలు వచ్చాయి.

భర్తతో గొడవపడటం వల్లే లీసెస్టర్‌కు చెందిన గ్లెండా బ్లాక్‌వెల్‌కు ఇలా అదృష్టం కలసి వచ్చింది. డబ్బులు వృథా చేస్తున్నావంటూ తన భర్తను చాలాసార్లు కోప్పడ్డానని, ఇకపై అలా మాట్లాడనని చెప్పింది. లాటరీ తగిలినందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపింది. లాటరీ డబ్బుతో ఓ ఇల్లు, కొంత భూమి కొనుగోలు చేస్తామని బ్లాక్‌వెల్ చెప్పింది. కుమార్తెకు సాయం చేస్తామని, కాలేజీలో చదువుకుంటున్న ఇద్దరు మనవరాళ్ల కోసం కొంత డబ్బు కేటాయిస్తామని భవిష్యత్ ప్రణాళికలను వెల్లడించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement