గురుత్వాకర్షణ తరంగాలకు.. తారల తళుకులకు లింకు! | link between Gravitational waves and stars | Sakshi
Sakshi News home page

గురుత్వాకర్షణ తరంగాలకు.. తారల తళుకులకు లింకు!

Oct 29 2014 2:28 AM | Updated on Sep 2 2017 3:30 PM

గురుత్వాకర్షణ తరంగాలకు.. తారల తళుకులకు లింకు!

గురుత్వాకర్షణ తరంగాలకు.. తారల తళుకులకు లింకు!

విశ్వంలో అదృశ్యరూపంలో ప్రయాణిస్తూ ఉండే గురుత్వాకర్షణ తరంగాలకు, నక్షత్రాల ప్రకాశానికి సంబంధం ఉందట!

న్యూయార్క్: విశ్వంలో అదృశ్యరూపంలో ప్రయాణిస్తూ ఉండే గురుత్వాకర్షణ తరంగాలకు, నక్షత్రాల ప్రకాశానికి సంబంధం ఉందట! ఈ లింకు ఆధారంగా గురుత్వాకర్షణ తరంగాలను గుర్తించొచ్చని న్యూయార్క్‌లోని అమెరికన్ మ్యూజియం ఆఫ్ నేచురల్ హిస్టరీ ఖగోళ భౌతికశాస్త్రవేత్త బారీ మెక్‌కెర్నాన్ వెల్లడించారు. విశ్వంలో పెద్ద గురుత్వాకర్షణ తరంగాలు తమచుట్టూ తాము వేగంగా తిరిగే పెద్ద సైజు ద్రవ్యరాశుల వల్ల ఉత్పత్తి అవుతాయని తెలిపారు.

విశ్వంలో గురుత్వాకర్షణ తరంగాల ఉనికిపై ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ సాపేక్ష సిద్ధాంతంలో ప్రతిపాదించారు. అయితే, గురుత్వాకర్షణ తరంగాల ప్రభావం పదార్థంపై స్వల్పంగానే  ఉంటుందని భావిస్తుండగా.. కృష్ణబిలాల వంటి పెద్ద సైజు పదార్థాల నుంచి ఉత్పత్తి అయ్యే గురుత్వాకర్షణ తరంగాలు పదార్థంపై ఎక్కువగానే ప్రభావం చూపుతాయని ప్రస్తుత అంచనా. కానీ, భూమి, అంతరిక్షం నుంచి లేజర్ కిరణాల ప్రయోగాలతోనే గురుత్వ తరంగాలను అంచనా వేస్తున్నారు. అయితే, ఒకదాని చుట్టూ ఒకటి తిరుగుతున్న అతిశక్తిమంతమైన రెండు కృష్ణబిలాల నుంచి వచ్చే గురుత్వ తరంగాల వల్ల సమీపంలోని పెద్దనక్షత్రాలన్నీ ఒకేసారి ప్రకాశవంతంగా మెరిసిపోతాయని, ఆ తర్వాత చిన్న నక్షత్రాలు మెరుస్తాయని, దీన్ని బట్టి గురుత్వ తరంగాలను గుర్తించవచ్చని మెక్‌కెర్నాన్ పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement