సౌదీ ఎడారిలో అద్భుతం..! | Life Sized Camel Sculptures Discovered in Saudi Arabia | Sakshi
Sakshi News home page

సౌదీ ఎడారిలో అద్భుతం..!

Feb 14 2018 5:10 PM | Updated on Feb 14 2018 5:47 PM

Life Sized Camel Sculptures Discovered in Saudi Arabia - Sakshi

సౌదీ ఎడారిలో పరిశోధకులు కనిపెట్టిన ఒంటె చిత్రం

రియాద్‌, సౌదీ అరేబియా : దాదాపు 2 వేల ఏళ్ల క్రితం రాతిపై చిత్రించిన అరుదైన ఒంటె చిత్రాలను సౌదీ అరేబియా ఎడారిలో పరిశోధకులు కనుగొన్నారు. వాస్తవానికి సౌదీ అరేబియాలో ఇలాంటి చిత్రాలు లభ్యకావడం కొత్తేమీ కాదు. అయితే, ఈ సారి పరిశోధకులు కనుగొన్న ఒంటెల చిత్రాలు భారీ ఆకారంలో ఉన్నాయి.

ఒకే ప్రాంతంలో దాదాపు 12 ఒంటెల చిత్రాలు ఉ‍న్నాయని, ఇలా ఒకే చోట ఇన్ని చిత్రాలు ఉండటం అరుదని చెప్పారు. కొన్ని చిత్రాలను పూర్తిగా చెక్కకుండా వదిలేసినట్లు వెల్లడించారు. బహుశా ఈ ప్రదేశం నుంచి ప్రార్థనలు చేయడం వల్ల ఈ చిత్రాలను చెక్కి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. అరేబియన్‌ రాక్‌ ఆర్ట్‌లో పెయింటింగ్‌, శిలలపై చెక్కడానికి చాలా ప్రాధాన్యత ఉందని తెలిపారు. ముఖ్యంగా యుద్ధం, వేట, జంతువులకు సంబంధించిన బొమ్మలను రాక్‌ ఆర్ట్‌లో భాగంగా పూర్వకాలపు అరేబియన్లు చిత్రించేవారని వివరించారు.

సౌదీ అరేబియా - రాక్ ఆర్ట్‌ :
అరేబియా పెనిసులాపై ఒకే మిలియన్‌ సంవత్సరాల క్రితమే మనిషి నివసించినట్లు ఆనవాళ్లు ఉన్నాయి. సౌదీ అరేబియాలో 4 వేల రిజిస్టర్డ్‌ ఆర్కియలాజికల్‌ సంస్థలు ఉండగా.. అందులో 1500 రాక్‌ ఆర్ట్‌పై పరిశోధనలు చేస్తున్నాయి. అందుకు కారణం రాక్‌ ఆర్ట్‌కు సౌదీ అరేబియన్లు ఇచ్చిన ప్రాధాన్యమే.

10 వేల నుంచి 8 వేల సంవత్సరాల క్రితం సౌదీ అరేబియాలో జంతువుల చిత్రాలను రాళ్లపై చిత్రించడం మొదలైంది. ముఖ్యంగా ఆవులు, ఒంటెలు, కుక్కల చిత్రాలు సౌదీ అరేబియా చారిత్రక ప్రదేశాల్లో కనిపిస్తాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement