ముషార్రఫ్ను అరెస్టు చేయండి | Lal Masjid case: arrest warrant issued against Musharraf | Sakshi
Sakshi News home page

ముషార్రఫ్ను అరెస్టు చేయండి

Apr 2 2015 1:10 PM | Updated on Aug 20 2018 4:35 PM

ముషార్రఫ్ను అరెస్టు చేయండి - Sakshi

ముషార్రఫ్ను అరెస్టు చేయండి

ఇస్లామాబాద్: పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ను అరెస్టు చేయాలని ఇస్లామాబాద్ జిల్లా కోర్టు పోలీసులను ఆదేశించింది.

ఇస్లామాబాద్: పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ను అరెస్టు చేయాలని ఇస్లామాబాద్ జిల్లా కోర్టు పోలీసులను ఆదేశించింది.  ఆయనకు నాన్ బెయిలబుల్ వారెంట్ను జారీ చేస్తూ పోలీసులకు ఆదేశాలిచ్చింది. లాల్ మసీద్ ముస్లిం మత పెద్ద అబ్దుల్ రషీద్ ఘాజి, అతడి తల్లి హత్య కేసుకు సంబంధించి కోర్టు హాజరుకాకుండా ప్రతిసారి తప్పించుకుంటున్నారని ఈ సందర్భంగా కోర్టు తెలిపింది.

2007 నుంచి కూడా ఆయన ఇదే తంతు కొనసాగిస్తున్నారని అతడిని వెంటనే అదుపులోకి తీసుకోవాలని ఆదేశించింది.  కోర్టు హాజరు నుంచి తనకు మినహాయింపు ఇచ్చేలా ముషార్రఫ్ దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు ఈ సందర్భంగా తిరస్కరించింది.  ఈయనపై పాకిస్థాన్ మాజీ ప్రధాని బెనజీర్ బుట్టోను హత్య చేసిన ఆరోపణలు కూడా ఉన్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement