అక్కసు వెళ్లగక్కిన కిమ్‌ జోంగ్‌ ఉన్‌

Kim Jong Un Orders The Destruction Of South Korean Made Hotels In North - Sakshi

సియోల్‌ : ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ మరోసారి దక్షిణ కొరియాపై అక్కసు వెళ్లగక్కాడు. ఉత్తర కొరియాలోని నార్త్‌ డైమండ్‌ మౌంటేన్‌ రిసార్ట్‌పై నిర్మించిన దక్షిణ కొరియాకు చెందిన హోటళ్లు, ఇతర పర్యాటక నిర్మాణాలను కూల్చేయాలంటూ అధికారులను ఆదేశించారు. 'ఇటీవలే డైమండ్‌ మౌంటేన్‌ రిసార్ట్‌ ప్రాంతాన్ని సందర్శించాను. ఈ ప్రాంతంలో క్షిణ కొరియా నిర్మించిన హోటళ్లు​ మా దేశ జాతీయ భావాన్ని అభివర్ణించేవిగా లేవు. అందుకే కూల్చివేత నిర్ణయం తీసుకున్నా' అని కిమ్‌ పేర్కొన్నారు. అయితే, ఏడాది కాలంగా ఇరు దేశాల మద్య ఆర్థిక సంబంధాలు బలోపేతం కావడానికి దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్‌-జే-ఇన్‌ కిమ్‌తో మూడుసార్లు చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. కిమ్‌ తాజా నిర్ణయం ఇరు దేశాల సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశముంది.

'విభజనకు ముందు మా పూర్వీకులు డబ్బులకు ఆశపడి ఈ ప్రాంతాలను లీజుకిచ్చారు. అప్పటి నుంచి పది సంవత్సరాల వరకు ఈ ప్రాంతాన్ని పట్టించుకోలేదు. దీంతో ఎటువంటి నాణ్యత ప్రమాణాలు లేకుండానే అక్కడ హోటళ్లను, పర్యాటక నిర్మాణాలు ఏర్పాటు చేయడంతో అవి గుడారాల్లాగా మిగిలిపోయాయి. మా పూర్వీకులు చేసిన తప్పిదాన్ని సరిదిద్దాలనే ఉద్దేశంతోనే.. పొరుగు దేశం నిర్మించిన భవనాలను కూల్చేయాలని అధికారులను ఆదేశించాను’అని కిమ్‌ మీడియాతో అన్నారు. రాజధాని సియోల్‌లోనూ దక్షిణ కొరియాకు సంబంధించిన భవనాలను వెంటనే తొలగించేలా కిమ్‌ అధికారులను ఆదేశించారు. మరోవైపు మౌంట్‌ కుమాంగ్‌ పర్వతంపై నిర్మించనున్న 'న్యూ మోడ్రన్‌ సర్వీస్‌ ఫెసిలిటీ'కి సంబంధించి దక్షిణ కొరియా అధికారులతో కిమ్‌ సమావేశమైనట్టు తెలుస్తోంది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top