గూగుల్‌.. మీకు తెలుసా?.. | Kid Named As Google In Indonesia | Sakshi
Sakshi News home page

హాయ్‌ గూగుల్‌..!

Jul 7 2019 8:57 AM | Updated on Jul 7 2019 8:57 AM

Kid Named As Google In Indonesia - Sakshi

గూగుల్‌.. మీకు తెలుసా.. ఓ ఎందుకు తెలియదు.. సెర్చ్‌ ఇంజన్‌ కదా.. ముద్దుగా గూగుల్‌ తల్లి అని కూడా పిలుచుకుంటామని ఠక్కున చెప్పేయకండి. ఎందుకంటే ఈ గూగుల్‌ మీరనుకునే గూగుల్‌ కాదు. ఈ గూగుల్‌ ఓ బుజ్జి అబ్బాయి. వయసు 8 నెలలు. ఉండేది ఇండొనేసియాలో. 31 ఏళ్ల ఆండీ సాపుత్ర తన బిడ్డకు మంచి పేరు పెట్టాలని చాలా నెలలు ఆలోచించాడు. ఎక్కడా కనీవినీ ఎరుగని పేరు పెట్టాలని తెగ ఆలోచించాడు ఆండీ. అందుకోసం విండోస్, ఐఫోన్, మైక్రోసాఫ్ట్, ఐవోఎస్‌ ఇలా చాలానే ట్రై చేశాడు. చివరికి గూగుల్‌ అని పేరు పెట్టాడు. ఇక్కడో మరో విశేషం ఏంటంటే ఆ అబ్బాయికి ఇంటిపేరు, చివరిపేరు ఇలా ఏమీ లేదు.. కేవలం గూగుల్‌..! అందుకే ఈ అబ్బాయి పేరును.. ‘ప్రపంచంలోనే వింత పేరు’ అనే అవార్డు వరించింది. కనీసం ఇంటిపేరు కూడా పెట్టకుండా ఒకే పేరు పెట్టడంపై అందరూ ప్రశ్నించగా.. అంత మంచి... వెరైటీ పేరును ఎందుకు పాడు చేయాలనే ఉద్దేశంతో ఏ తోకా తగిలించలేదని చెప్పుకొచ్చాడు.

Advertisement
 
Advertisement
Advertisement