వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పిచ్చి పరాకాష్టకు చేరింది. తన పరిపాలనా కాలంలో తమవి కాని ప్రముఖ ప్రాంతాలు, దీవులు, సముద్రాల పేర్లు మార్చాలని ఉవ్విళ్లురుతున్నారు. వాటికి తన పేరు పెట్టుకోవాలని ఆశ పడుతున్నారు. ఈ నేపథ్యంలో అంట్లాటిక్ మహాసముద్రం పేరును ట్రంప్, లేదంటే అమెరికా వచ్చేలా పేర్లు పెట్టాలనే ప్రతిపాదనలు తెచ్చారు. అందుకు ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ నిరాకరించారు.
ఇదే విషయాన్ని త్వరలో అమెరికాలో మద్యంతర ఎన్నికలు జరగనున్నాయి. సౌత్ కరోలినా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మహా సముద్రాల పేర్లు మార్చాలనే అంశంపై తనకు సుందర్ పిచ్చయ్‌కు మద్య చర్చలు జరిగాయి. ఇటీవల నేను గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్,గూగుల్ కో-ఫౌండర్ సెర్గీ బ్రిన్‌లలను కలిశా. వాళ్లిద్ధరూ అపర మేధావులు. ఓ సారి మహా సముద్రాల పేర్లు మార్చే అంశంపై వారితో చర్చించా. సీఈవో సుందర్ పిచాయ్‌తో మాట్లాడాను. గూగుల్‌లో మహా సముద్రం పేరు మార్చాలని కోరాను. అందుకు వెంటనే ఆయన నో, నో, నో.. ఈసారి మాత్రం నేను దీన్ని చేయలేను సార్ అని అన్నారు.
మహాసముద్రాలు ఇతర భౌగోళిక ప్రాంతాల లాంటివి కాదని, అవి అనేక దేశాలను కవర్ చేస్తూ అంతర్జాతీయంగా విస్తరించి ఉంటాయని సుందర్ నాతో చెప్పారు. ఆ తర్వాత నేను ఆ ప్రతిపాదనను విరమించుకున్నట్లు చెప్పాను’ అని అన్నారు.
ట్రంప్ గత ప్రయత్నాలు..
తన పదవీకాలంలో ఏదైనా శాశ్వతంగా గుర్తుండిపోయేలా భౌగోళిక ప్రాంతాల పేర్లు మార్చాలని ట్రంప్ గతంలోనూ ప్రయత్నించారు. గతేడాది గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరును గల్ఫ్ ఆఫ్ అమెరికాగా మార్చాలని ఆయన నిర్ణయించారు. ఇది మెక్సికోతో దౌత్యపరమైన ఉద్రిక్తతలకు దారితీసింది. అలాగే కెనడా-అమెరికా సరిహద్దుల్లో ఉన్న లేక్ ఒంటారియో పేరును ఈ ఏడాది ఆగస్టులో లేక్ అమెరికాగా మార్చారు.
ఈ మార్పుల తర్వాత గూగుల్ మ్యాప్స్ వంటి ప్రైవేట్ మ్యాపింగ్ కంపెనీలు అమెరికా వినియోగదారుల కోసం ఆ పేర్లను అప్‌డేట్ చేసినప్పటికీ, అంతర్జాతీయంగా అవి పూర్తిగా గుర్తింపు పొందలేదు. అయితే ఇప్పుడు ఏకంగా మహాసముద్రాల పేర్లను ట్రంప్ ఓషన్, ఓషన్ ఆఫ్ ది అమెరికాస్‌గా మార్చాలని ట్రంప్ భావించినప్పటికీ, సుందర్ పిచాయ్ మాత్రం అందుకు అంగీకరించకపోవడం గమనార్హం.
ఇదీ చదవండి : ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. ‘ముస్లిం నగరంగా పారిస్’


