బ్రిటిష్ పార్లమెంట్‌పై దాడికి యత్నించిన దుండగుడు ఖలీద్ మసూద్ తమ దేశంలో కొంతకాలం ఉన్నాడని సౌదీ అరేబియా ప్రకటించింది.
లండన్: బ్రిటిష్ పార్లమెంట్‌పై దాడికి యత్నించిన దుండగుడు ఖలీద్ మసూద్ తమ దేశంలో కొంతకాలం ఉన్నాడని సౌదీ అరేబియా ప్రకటించింది. 2005నవంబర్ నుంచి 2006నవంబర్ వరకూ, 2008 ఏప్రిల్ నుంచి 2009 ఏప్రిల్ వరకు వర్క్‌వీసాపై తమ దేశంలో ఇంగ్లిష్ ఉపాధ్యాయుడిగా పనిచేశాడని తెలిపింది. 2015 మార్చిలో తిరిగి ఆరు రోజులపాటు ఇక్కడే గడిపాడని పేర్కొంది.
ఖలీద్ మసూద్ అసలు పేరు ఆడ్రియన్ ఎల్మ్స్ అని బ్రిటన్‌లోని సౌదీ అరేబియా రాయబార కార్యాలయం వెల్లడించింది. హింసా ప్రవృత్తి కలిగిన అతడిపై పలు నేరారోపణలున్నాయని శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. శుక్రవారం ఉదయం మసూద్ మితిమీరిన వేగంతో కారునడిపి పలువురి మృతికి కారణమైన ఇతడు ఓ పోలీసు అధికారిని కూడా పొడిచి చంపాడు. అనంతరం భద్రతా అధికారుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన విషయం విదితమే.