
కెన్యా అధ్యక్షుడిగా రెండోసారి కెన్యట్టా
ఆఫ్రికా దేశం కెన్యా అధ్యక్షుడిగా ఉహురు కెన్యట్టా రెండోసారి ఎన్నికయ్యారు.
నైరోబి: ఆఫ్రికా దేశం కెన్యా అధ్యక్షుడిగా ఉహురు కెన్యట్టా రెండోసారి ఎన్నికయ్యారు. 54.27 శాతం ఓట్లు దక్కించుకున్న కెన్యట్టా విజయం సాధించినట్లు కెన్యా ఎన్నికల సంఘం శుక్రవారం ప్రకటించింది.
అయితే ఎన్నికలు సక్రమంగా జరగలేదనీ, పలుచోట్ల రిగ్గింగ్, ఓటింగ్ యంత్రాల ట్యాంపరింగ్ జరిగిందని ఎన్నికల్లో ఓడిపోయిన రైలా ఒడింగా ఆరోపిస్తున్నారు. కెన్యట్టా వైఖరిని నిరసిస్తూ కెన్యాలో ప్రతిపక్ష పార్టీ మద్దతుదారులు భారీ ఆందోళనలకు దిగడంతో పరిస్థితులు హింసాత్మకంగా మారాయి. గొడవల్లో 11 మంది నిరసనకారులు చనిపోయారు.