స్వీయ నిర్బంధంలో ‘ముద్దు’ ముచ్చట

Justin Bieber Shares Kissing Hailey Baldwin Photo While On Quarantine - Sakshi

కెనడా : కరోనా వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో ముందు జాగ్రత్త చర్యగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ, రాజకీయ, ఇతర ప్రముఖులు స్వీయ నిర్బంధంలోకి వెళ్లిపోయారు. ప్రజలు కూడా బయట తిరగకుండా ఇంటికి పరిమితమవ్వాలని వారు సూచిస్తున్నారు. అంతేకాకుండా స్వీయ నిర్బంధంలోని తమ అనుభవాలను సోషల్‌ మీడియా ద్వారా పంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఓ స్టార్‌ కపుల్‌కు చెందిన ‘ముద్దు’ ముచ్చట వైరల్‌గా మారింది. పాప్‌ సింగర్‌ జస్టిన్‌ బీబర్‌ తన భార్య, మోడల్‌ హేలే బాల్డ్‌విన్‌ను ముద్దు పెట్టుకున్న ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో షేర్‌ చేశారు. ‘నా స్వీయ నిర్బంధ భాగస్వామి’ అంటూ స్పందించారు. ( అవును.. ఎమోషనల్‌ బ్లాక్‌మెయిల్‌కు గురయ్యా: సింగర్‌ )

కాగా, గత కొద్దిరోజులుగా స్వీయ నిర్బంధంలో ఉన్న ఈ జంట తమకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు సోషల్‌మీడియా ద్వారా పంచుకుంటోంది. రీసెంట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌లోకి వచ్చిన జస్టిన్‌ బీబర్‌ కరోనా వైరస్‌ సోకకుండా ఉండేందుకు తీసుకోవల్సిన జాగ్రత్తలను వివరించారు. అయితే కొంతకాలంగా లాస్‌ ఏంజిల్స్‌లో ఉన్న ఆయన ఈనెల 16న భార్యతో కలిసి కెనడా వచ్చేశారు.

My quarantine partner

A post shared by Justin Bieber (@justinbieber) on

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top