ర్యాన్సమ్ వేర్ బారిన మరో ప్రముఖ దేశం | Japan wakes up to global 'ransomware' cyberattack | Sakshi
Sakshi News home page

ర్యాన్సమ్ వేర్ బారిన మరో ప్రముఖ దేశం

Published Mon, May 15 2017 12:55 PM | Last Updated on Tue, Sep 5 2017 11:13 AM

ర్యాన్సమ్ వేర్ బారిన మరో ప్రముఖ దేశం

ర్యాన్సమ్ వేర్ బారిన మరో ప్రముఖ దేశం

ప్రపంచ దేశాలకు పెను ముప్పుగా, ఆధునిక టెక్నాలజీ భద్రతకు సవాలు విసురుతూ ఉద్భవించిన వనాక్రై ర్యాన్సమ్ వేర్ బాధిత దేశ జాబితాలో జపాన్ కూడా వచ్చి చేరింది.

టోక్యో : ప్రపంచ దేశాలకు పెను ముప్పుగా, ఆధునిక టెక్నాలజీ భద్రతకు సవాలు విసురుతూ ఉద్భవించిన వనాక్రై ర్యాన్సమ్ వేర్ బాధిత దేశ జాబితాలో జపాన్ కూడా వచ్చి చేరింది. ఇప్పటికే ఈ సైబర్ దాడి 150 దేశాల్లో బీభత్సం సృష్టిస్తున్న  సంగతి తెలిసిందే. ప్రస్తుతం జపాన్ లోని అతిపెద్ద మోటార్ దిగ్గజం నిస్సాన్ మోటార్ కార్పొరేషన్ కు చెందిన కొన్ని యూనిట్లను వనాక్రై టార్గెట్ చేసిందని ఆ కంపెనీ ధృవీకరించింది. కానీ తమ బిజినెస్ లపై అంతపెద్ద ప్రభావమేమీ పడలేదని పేర్కొంది. హిటాచి అధికార ప్రతినిధి కూడా తమ ఫైల్స్ ఓపెన్ కావడం లేదని, ఈ-మెయిల్స్ వ్యవస్థ స్తంభించిందని, అసలు డెలివరీ కావడం లేదని పేర్కొన్నారు.
 
దీనికి కారణం ర్యాన్సమ్ వేర్ అటాకేనని తాము నమ్ముతున్నట్టు, అయితే ఇప్పటివరకు ఎలాంటి డిమాండ్లు ఆ అటాకర్ల  నుంచి రాలేదని చెప్పారు. ఇప్పటికే జపాన్ లో 600 ప్రాంతాల్లో 2000 కంప్యూటర్లు ఈ బారిన పడినట్టు జపాన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ కో-ఆర్డినేటర్ సెంటర్ రిపోర్టు చేసింది. కొంతమంది వ్యక్తిగతంగా కూడా తాము ఈ సైబర్ దాడిన పడినట్టు చెప్పినట్టు వెల్లడించింది. ఆధునిక టెక్నాలజీ భద్రతకు సవాల్ విసురుతూ ఊహించనిరీతిలో హ్యాకర్లు విరుచుకుపడ్డారు. యూరప్, లాటిన్ అమెరికా, ఆసియాలోని కొన్ని ప్రాంతాలు ఈ ర్యాన్సమ్ వేర్  మాల్‌వేర్ బారినపడ్డాయి. భారత్‌లోని కొన్ని కంపెనీలు దీని ప్రభావానికి గురయ్యాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement