టాక్సీలో 850 కి.మీ. తిరిగి.. డబ్బు లేదన్నాడు! | Japan man arrested over unpaid taxi fare for 850 km trip | Sakshi
Sakshi News home page

టాక్సీలో 850 కి.మీ. తిరిగి.. డబ్బు లేదన్నాడు!

Aug 15 2016 3:15 PM | Updated on Sep 4 2017 9:24 AM

టాక్సీలో 850 కి.మీ. తిరిగి.. డబ్బు లేదన్నాడు!

టాక్సీలో 850 కి.మీ. తిరిగి.. డబ్బు లేదన్నాడు!

హాయిగా టాక్సీ ఎక్కి, 850 కిలోమీటర్ల ప్రయాణం చేసిన తర్వాత తన దగ్గర డబ్బు లేదని చేతులెత్తేశాడట.

హాయిగా టాక్సీ ఎక్కి, 850 కిలోమీటర్ల ప్రయాణం చేసిన తర్వాత తన దగ్గర డబ్బు లేదని చేతులెత్తేశాడట. ఈ విచిత్ర ఘటన జపాన్‌లో జరిగింది. ఉద్యోగం సద్యోగం ఏమీ లేని తకఫుమి అరిమా (26) అనే ఈ వ్యక్తి టోక్యోకు దక్షిణంగా ఉన్న యొకొహొమా నగరంలో టాక్సీ ఎక్కాడు. నైరుతి జపాన్‌లోని షికొకు ద్వీపంలో గల మట్సుయమ అనే ప్రాంతానికి తీసుకెళ్లాలని డ్రైవర్‌ను కోరాడు. అక్కడకు వెళ్లిన తర్వాత డబ్బులు ఇస్తానని చెప్పడంతో డ్రైవర్ సరేనని తీసుకెళ్లాడు.

రాత్రి మొత్తం దాదాపు 9 గంటల పాటు ప్రయాణం చేసిన తర్వాత గమ్యానికి చేరుకున్నారు. తీరా అక్కడకు వెళ్లిన తర్వాత మొత్తం టాక్సీ మీటర్ చూస్తే మనోడికి గుండె గుభేల్‌మంది. దాదాపు 1.75 లక్షల రూపాయల బిల్లు వచ్చింది. కానీ తన వద్ద అసలు డబ్బులే లేవని అరిమా చెప్పాడు. దాంతో ఏం చేయాలో అర్థం కాని టాక్సీ డ్రైవర్.. పోలీసులను పిలిచి విషయం చెప్పాడు. వాళ్లొచ్చి అరిమాను అరెస్టు చేశారు. చేతిలో డబ్బులు లేనప్పుడు అంతదూరం అది కూడా టాక్సీలో ఎందుకు వెళ్లాల్సి వచ్చిందనే విషయం మాత్రం ఇంకా తెలియలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement