నీళ్లలో ఉన్న మొసలినీ చంపేసింది! | jaguar attacks and kills crocodile that is in water | Sakshi
Sakshi News home page

నీళ్లలో ఉన్న మొసలినీ చంపేసింది!

Nov 21 2016 4:34 PM | Updated on Sep 4 2017 8:43 PM

నీళ్లలో ఉన్న మొసలినీ చంపేసింది!

నీళ్లలో ఉన్న మొసలినీ చంపేసింది!

సాధారణంగా నీళ్లలో ఉన్నప్పుడు మొసలికి బలం చాలా ఎక్కువగా ఉంటుందని, దాన్ని ఎవరూ ఏమీ చేయలేరని అంటారు. కానీ అది కూడా తప్పేనని తేలిపోయింది.

  • నీళ్ళలోన మొసలి నిగిడి యేనుఁగు బట్టు
  • బయట గుక్కచేత భంగపడును
  • స్థానబలముగాని తన బలిమికాదయా
  • విశ్వదాభిరామ వినురవేమ
  •  
    అనేది వేమన శతకంలో పద్యం. సాధారణంగా నీళ్లలో ఉన్నప్పుడు మొసలికి బలం చాలా ఎక్కువగా ఉంటుందని, దాన్ని ఎవరూ ఏమీ చేయలేరని అంటారు. కానీ అది కూడా తప్పేనని తేలిపోయింది. నీళ్లలో ఉన్న ఓ మొసలిని చిరుతపులి వెంటాడి.. వేటాడి మరీ దాని తల పట్టుకుని కొరికి చంపేసి మరీ గట్టుమీదకు లాక్కొచ్చింది. బ్రెజిల్‌ అడవుల్లో షూటింగ్ చేస్తున్నప్పుడు అనుకోకుండా ఈ దృశ్యం కెమెరా కంట పడింది. చిరుత పులులను 'కిల్లర్స్ ఆఫ్ కిల్లర్స్' అంటారు. ఆకలిగా ఉన్నప్పుడు ఇవి ఎంతటి సాహసమైనా చేస్తాయి. అచ్చం అలాంటి పరిస్థితిలోనే ఉన్న ఓ బలమైన చిరుత పులి.. ఎక్కడ చూసిందో గానీ నీళ్లలో ఉన్న మొసలిని చూసింది. అమాంతం దానిమీదకు దూకి, నోటితో దాని తల వెనక భాగంలో గట్టిగా కొరికి పట్టుకుని, ఒడ్డు మీదకు తీసుకొచ్చేసింది.
Advertisement
 
Advertisement
Advertisement