వేసవి కోసం ‘ఫ్యాన్‌ జాకెట్లు’ | Jacket That can Keep You Cool in Summer | Sakshi
Sakshi News home page

వేసవి కోసం ‘ఫ్యాన్‌ జాకెట్లు’

Jul 25 2019 2:33 PM | Updated on Jul 25 2019 2:35 PM

Jacket That can Keep You Cool in Summer - Sakshi

న్యూఢిల్లీ : బ్రిటన్, ఫ్రాన్స్‌ దేశాల్లో ఎండలు మండిపోతున్నాయి. ముఖ్యంగా బ్రిటన్‌లో ఉష్ణోగ్రత 39 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకోవడంతో గురువారంను ‘ట్రాపికల్‌ థర్స్‌డే’గా పిలుస్తున్నారు. ఒళ్లంతా కాలిపోతుందంటూ ఎక్కువ మంది స్విమ్మింగ్‌ పూల్స్, బీచ్‌ల వెంట పరుగులు తీస్తున్నారు. మరికొందరు వేడిని తట్టుకునే మంచు చెప్పులు, ఫ్యాన్‌ జాకెట్ల కోసం షాపింగ్‌ చేస్తున్నారు. మహాబీస్‌ డాట్‌ కామ్‌ ద్వారా దాదాపు (భారత్‌ కరెన్సీలో) ఆరు వందల రూపాయలకు ‘మహాబీస్‌ సమ్మర్‌ స్లిప్పర్స్‌’ను, అమెజాన్‌ డాట్‌ కో డాట్‌ యూకే ద్వారా 140 రూపాయలకు ‘ర్యాపిడ్‌ రిలీఫ్‌ రీ యూజబుల్‌ కోల్డ్‌ స్లిప్పర్స్‌’ను ప్రజలు ఎగబడి కొంటున్నారు. ఈ స్లిప్పర్స్‌ను ఇంటా బయట ఉపయోగించవచ్చు. వీటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసి ఫ్రిజ్‌లో పెట్టి కూల్‌ చేయాల్సి ఉంటుంది.

ఎండవేటిని తట్టుకోలేక అరిపాదాల్లోని నరాలు విస్తరిస్తున్నాయని, తద్వారా అరి పాదాలు స్వెల్లింగ్‌ వచ్చినట్లు ఉబ్బిపోతున్నాయని, అలాంటప్పుడు ఈ కోల్డ్‌ స్లిప్పర్స్‌ అద్భుతంగా పనిచేస్తున్నాయని వినియోగదారులు చెబుతున్నారు. ఇక ‘అమెజాన్‌ డాట్‌కో డాట్‌ ఇన్‌ యూకే’ ద్వారానే బ్యాటరీతో నడిచే ‘మకితా ఫ్యాన్‌ జాకెట్‌ను దాదాపు పది వేల రూపాయలకు కొనుగోలు చేస్తున్నారు. ఇందులో ముందు, వెనక భాగాల్లో ఉండే రెండు చిన్న ఫ్యాన్‌లు ఉండడమే కాకుండా చుట్టూరు నీటి బ్యాగ్‌ ఉంటుంది. రెండు ఫ్యాన్లు తిరుగుతున్నప్పుడు బ్యాగులోని నీరు ఆవిరవుతూ శరీరానికి కావాల్సినంత చల్లదనాన్ని ఇస్తుంది.

బ్రిటన్‌లో ఈసారి ఏసీ యూనిట్ల అమ్మకాలు ఏకంగా 11 శాతం పెరిగాయి. మరోపక్క వాటర్‌ పరుపులు కూడా ఎక్కువగానే అమ్ముడు పోతున్నాయి. ఈ పరుపుల మీద ఒంటరిగా పడుకుంటేనే శరీరం ఎక్కువగా చల్లగా ఉంటుందని బెడ్‌ కంపెనీ స్లీప్‌ ఆఫీసర్‌ నీల్‌ రాబిన్సన్‌ సూచిస్తున్నారు. ప్రజలు బయటకు వెళ్లినప్పుడు గడ్డకట్టిన మంచనీళ్ల బాటిళ్లను వెంట తీసుకెళుతున్నారు. ఎండకు చల్లటి మంచినీళ్లను తాగుతూ ఉండడం వల్ల ఒక్క శరీరానికే కాకుండా మెదడుకు కూడా కావాల్సినంత చల్లదనం దొరుకుతుందని వైద్యులు సూచిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement