సైనికులకు చైనీస్‌లో శిక్షణ

ITBP troops to learn Chinese, will get climate control technology in border areas - Sakshi

సాక్షి,న్యూఢిల్లీ: చైనా సరిహద్దులో ఇండో టిబెటన్‌ సరిహద్దు (ఐటీబీపీ) దళాలకు చైనా (మాండరిన్‌)భాషలో ‍ప్రావీణ్యం కల్పించాలని భారత సైన్యం యోచిస్తోంది. బోర్డర్‌లో మరో 50 ఐటీబీపీ పోస్టులు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్న క్రమంలో దళాలకు అత్యాధునిక సాధనాసంపత్తిని సమకూర్చనుంది. నిత్యం 20 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలో సేవలందిస్తున్న సైనికులు ఆ వాతావరణాన్ని తట్టుకునేందుకు ఆధునిక టెక్నాలజీని వినియోగిస్తున్నారు. దళాల సామర్థ్యం పెంపుకు, వారి సౌకర్యాల కోసం ప్రభుత్వం దృష్టిసారిస్తోందని హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ చెప్పారు.

ఐటీబీపీ అధికారులు, జవాన్లను ఉద్దేశించి మంత్రి ప్రసంగించారు. అరుణాచల్‌ ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ప్రదేశ్‌లో 25 బోర్డర్‌ రహదారులు నిర్మిస్తామని, 9000 అడుగుల ఎత్తులో పనిచేసే సైనికులకు తేలికపాటి శీతల దుస్తులు అందచేస్తామని చెప్పారు. ఇండో చైనా బోర్డర్‌లో 3488 కిమీ ఎత్తులో సేవలందించే సైనికులకు స్నో స్కూటర్‌లను అందుబాటులోకి తేనున్నట్టు తెలిపారు.బోర్డర్‌ పోస్ట్‌ల్లో అత్యంత ఎత్తులో పనిచేసే పోస్ట్‌లకు హెలికాఫ్టర్లను అద్దెకు సమకూర్చాలనే ప్రతిపాదనను హోంమంత్రిత్వ శాఖ ఆమోదించిందని చెప్పారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top