గ్యాస్‌ స్టేషన్‌పై ట్రక్కు బాంబుతో దాడి.. 80 మంది మృతి | Islamic State claims truck bomb massacre Baghdad | Sakshi
Sakshi News home page

గ్యాస్‌ స్టేషన్‌పై ట్రక్కు బాంబుతో దాడి.. 80 మంది మృతి

Nov 24 2016 8:20 PM | Updated on Sep 4 2017 9:01 PM

గ్యాస్‌ స్టేషన్‌పై ట్రక్కు బాంబుతో దాడి.. 80 మంది మృతి

గ్యాస్‌ స్టేషన్‌పై ట్రక్కు బాంబుతో దాడి.. 80 మంది మృతి

ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు.

బాగ్దాద్‌:  ఇరాక్‌ రాజధాని బాగ్దాద్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. పశ్చిమ బాగ్దాద్‌లోని గ్యాస్‌ స్టేషన్‌పై ఓ ఆత్మాహుతి దాడి సభ్యుడు ట్రక్కు బాంబుతో దాడి చేయడంతో భారీ మొత్తంలో ప్రాణనష్టం చోటుచేసుకుంది. 80మందికిపైగా మృతి చెందగా, 20 మందికి పైగా గాయపడ్డారు. మృతి చెందిన వారందరూ షియా భక్తులే. పవిత్ర షియా నగరం కర్బాలా నుంచి వస్తుండగా ఉగ్రవాది ట్రక్కు బాంబుతో విరుచుకుపడ్డాడు.

మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ‘పశ్చిమ బాగ్దాద్‌ లోని గ్యాస్‌ స్టేషన్‌ పై మేం దాడి చేశాం’  అంటూ ఇస్లామిక్‌ స్టేట్‌ స్వయంగా ప్రకటించింది.

Advertisement
 
Advertisement
Advertisement